Chris Woakes Retirement: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు క్రిస్ వోక్స్. ఇటీవల జరిగిన టెస్టుల్లో ఇండియాపై ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన క్రిస్ వోక్స్…. వ్యక్తిగత కారణాలు, వరుస గాయాల కారణాల వల్ల.. 36 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేశాడు.
ఇంగ్లాండ్ జట్టులో స్టార్ బౌలర్ గా ఎదిగిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ క్రిస్ వోక్స్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మర్స్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తూ అధికారిక ప్రకటన చేశాడు. ఈ విషయంపై ఇంగ్లాండు క్రికెట్ బోర్డుకు కూడా సమాచారం అందించాడు. దాదాపు ఇంగ్లాండ్ జట్టు కోసం 15 ఏళ్ల పాటు…. పనిచేశాడు క్రిస్ వోక్స్. ఇటీవల ఇంగ్లాండు వర్సెస్ టీమిండియా మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చేతికి గాయమైనప్పటికీ కూడా సింగల్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ క్రిస్ వోక్స్ ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇన్ని రోజులు తనకు అవకాశాలు ఇచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన కెరీర్ మొత్తంలో అభిమానులు అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచిందని ఈ సందర్భంగా తెలిపారు. వాళ్లందరికీ తాను నిత్యం కృతజ్ఞుడిగా ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని… కానీ కౌంటింగ్ క్రికెట్ ఆడతానని వెల్లడించారు. అదే సమయంలో ఫ్రాంఛైజీ లీగుల్లో కూడా అవకాశాల కోసం వెతుకుతున్నానని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు క్రిస్ వోక్స్.
క్రిస్ వోక్స్… ఇంగ్లాండ్ జట్టులో చాలా కీలకమైన ప్లేయర్. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. నవంబర్ 21వ తేదీ నుంచి ఆస్ట్రేలియా తో ప్రారంభమయ్యే యాషేస్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో క్రిస్ వోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొంతమంది చెబుతున్నారు. అతని వయసు 36 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతనికి అవకాశాలు ఇవ్వలేదని అంటున్నారు. కానీ అతని సత్తా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అవకాశం ఇచ్చి ఉంటే అతడు రిటైర్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఇది ఇలా ఉండగా.. 2011 సమయంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన క్రిస్ వోక్స్ 62 టెస్టులు ఆడాడు. అలాగే 122 వన్డేలు, 33 t20 మ్యాచ్ లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 192 వికెట్లు తీసిన క్రిస్ వోక్స్ వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. అలాగే t20 లో 31 వికెట్లు తీసి సత్తా చాటాడు.
Pleasure has been all mine. No regrets 🏴 pic.twitter.com/kzUKsnNehy
— Chris Woakes (@chriswoakes) September 29, 2025