Jio Super Plan: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కనీసం రెండు లేదా మూడు మొబైల్ నంబర్లు ఉంటాయి. ముఖ్యంగా జియో సిమ్ కార్డ్ వాడుతున్నవారు ఎక్కువ. కానీ ప్రతి నంబర్ కోసం వేరువేరుగా రీఛార్జ్ చేస్తూ ఉంటే ఖర్చు గణనీయంగా పెరిగిపోతుంది. పెరిగిన టారిఫ్ ధరలతో ఒక్కో నెలలో రీఛార్జ్ చేయడం నిజంగానే బరువుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జియో తీసుకొచ్చిన ఒక ప్రత్యేక ప్లాన్ చాలా మందికి ఉపయోగకరంగా మారుతోంది. కేవలం ఒకే రీఛార్జ్‌తో మూడు నంబర్లను వాడుకునే అవకాశం ఈ ప్లాన్ ఇస్తోంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే, లాభాలు మూడు రెట్లు అన్నమాట.
జియో సూపర్ ప్లాన్ అంటే ఏమిటి?
ఈ ఆఫర్ పేరు జియో సూపర్ ప్లాన్. ఇది రూ.449 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. దీనిని ఎంచుకుంటే, నెలకు ఒకే బిల్‌లో మూడువరకు సిమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఒకవైపు కాల్స్, మెసేజెస్ అన్లిమిటెడ్‌గా లభిస్తాయి, మరోవైపు డేటా కూడా మంచి పరిమితిలో లభిస్తుంది.
ప్లాన్ వివరాలు
ఈ ప్లాన్‌లో ప్రధానంగా యూజర్లకు 75జిబి డేటా అందుతుంది. ఇది అయిపోయిన తర్వాత అదనంగా 1జిబి డేటా కావాలంటే రూ.10 చెల్లించాలి. అలాగే ఒకసారి రీఛార్జ్ చేస్తే మూడు నంబర్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అదనపు సిమ్‌లను యాడ్ చేసుకోవాలంటే ఒక్కో సిమ్‌కి రూ.150 అదనంగా కట్టాలి. కానీ అదనంగా యాడ్ అయ్యే ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి 5GB డేటా బోనస్‌గా లభిస్తుంది. అంతేకాదు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీగా వస్తాయి.
Also Read: Aadhaar update: ఆధార్ కార్డు అప్‌డేట్ ఫ్రీ కేవలం ఈ నెలవరకే.. అక్టోబర్ నుంచి ఛార్జీలు డబుల్
స్పెషల్ బెనిఫిట్స్
ఇదంతా కాకుండా ఈ ప్లాన్‌లో మరికొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. జియో 9th యానివర్సరీ సెలబ్రేషన్ లో భాగంగా యూజర్లకు అదనపు గిఫ్ట్‌లు ఇస్తోంది. ఉదాహరణకి, రెండు నెలల పాటు జియోహోమ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, ఎజియో నుంచి రూ.1000 షాపింగ్‌పై రూ.200 డిస్కౌంట్, ఒక నెల జియోసావ్న్ ప్రో, మూడు నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, అలాగే 50జిబి ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
జియో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో పెద్ద అదనపు ప్లస్ పాయింట్ ఏమిటంటే అర్హత యూజర్లకు అన్లిమిటెడ్ 5జి సౌకర్యం కూడా లభిస్తుంది. అంటే మీరు 5జి సపోర్ట్ చేసే ఫోన్ వాడుతున్నట్లయితే, స్పీడ్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ జియో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే కేవలం రూ.449తోనే ఈ సౌకర్యాలు అందుతాయి. అదనపు సిమ్ కోసం కొద్దిగా రుసుము చెల్లించాల్సి వచ్చినా, మొత్తానికి ఇది ఖర్చు తగ్గించే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
జియో ఇప్పటికే టెలికాం మార్కెట్లో అనేక రకాల పోటీని సృష్టించింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్లాన్‌తో మరింత మంది యూజర్లను ఆకర్షిస్తోంది. కాబట్టి, మీ ఇంట్లో అందరూ జియో వాడుతున్నట్లయితే, ఒక్కో నంబర్‌కు వేరువేరుగా రీఛార్జ్ చేయడం కన్నా ఈ ప్లాన్‌ని ఎంచుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది.