E-Paper
Advertisement

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..
Advertisement

Sri Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓడీసీ మండలంలో దారుణం చోటు చేసుకుంది. నాటు వైద్యం పేరుతో ఓ ఆర్ఎంపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. టి.కుంట్లపల్లి, బసప్పగారి పల్లెల్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పులు బాగుచేస్తానంటూ అంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సూది మంది వికటించి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పలు గ్రామాలకు చెందిన 30 మంది.. అమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఈనెల 3న చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. వీరందరికీ ఆర్ఎంపీ సూది మందు ఇచ్చాడు. సూది మందు తీసుకున్న రోజు నుంచి టి.కుంట్లపల్లికి చెందిన పప్పురమ్మ, ఓబులేసు, సాహెబ్ పీరాలకు మోకాళ్ల నొప్పులు అధికమయ్యాయి.

Advertisement

వీరితోపాటు బసప్పగారిపల్లికి చెందిన రామప్ప, ఉత్తన్నలకు మోకాళ్ల నొప్పులు పెరిగిపోయాయి. విపరీతంగా వాపులు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో పప్పురమ్మ, రామప్పల పరిస్థితి విషమించి మరణించారు. ఓబులేసు, సాహెబ్ పీరా, ఉత్తన్నల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పప్పురమ్మ, రామప్ప మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యునిపై వెంటనే చర్యలు చేసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.

Tags

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×