E-Paper
Advertisement

Srisailam Temple Controversy: శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!

Srisailam Temple Controversy: శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
Advertisement

Srisailam Temple Controversy: నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల వేళ తీవ్ర కలకలం రేగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి గర్భాలయంలోకి మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిన ఒక భక్తుడు.. ఏకంగా స్వామి వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అత్యంత పవిత్రమైన గర్భగుడి దృశ్యాలు ‘X’ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో భక్తులు.. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉగాది పండుగ పురస్కరించుకుని ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయి అపచారం జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.

శ్రీశైల దేవస్థానంలో మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ.. గర్భాలయం వరకు ఫోన్ ఎలా వెళ్లిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉగాది బ్రహ్మోత్సవాలను స్వయంగా జిల్లా ఎస్పీ, ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వందలాది సీసీ కెమెరాలు ఉన్న క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. అధికారుల అసమర్థత వల్లే శ్రీశైలం వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని ఆరోపించింది. ఏఈఓ స్థాయి అధికారులు.. సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ ఈ ఘోర అపచారం ఎలా జరిగిందని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

గర్భాలయ వీడియో చిత్రీకరణపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “పోలీసుల నిఘా.. అధికారుల పర్యవేక్షణ గర్భగుడి దగ్గర పని చేయలేదా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా శ్రీశైల దేవస్థాన అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అపచారాలు పునరావృతమవుతున్నాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ అధికారులు.. పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భక్తుడు ఏ సమయంలో దర్శనం చేసుకున్నాడు? ఏ గేటు ద్వారా లోపలికి వచ్చాడు? అనే కోణంలో విచారణ జరుగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరగడంతో.. ఈ వివాదంపై దేవస్థానం ఈఓ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Read Also: Air India Flight News: ఎయిర్ ఇండియా భారీ తప్పిదం.. ఢిల్లీ నుంచి కెనడా వెళ్లాల్సిన విమానం.. చైనా నుంచి మళ్లీ వెనక్కి!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×