E-Paper
Advertisement

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాన్ని తిరగరాస్తున్న నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీలో మార్పులు!

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాన్ని తిరగరాస్తున్న నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీలో మార్పులు!
Advertisement

TDP Strategy: దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో.. తెలుగుదేశం అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనం, వ్యూహాత్మక మౌనం, విలువలతో కూడిన రాజకీయం చేసే పార్టీగా ముద్ర పడింది. కానీ, మారుతున్న కాలానికి అుగుణంగా పార్టీ పంథాలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రత్యర్థుల ఎటాక్‌ను తిప్పికొట్టడంలో తమ్ముళ్లు ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే బాబు మార్క్ రాజకీయానికి కాలం చెల్లిందా? అనే డౌట్ వస్తోంది.

వైసీపీ దూకుడు శైలి..

ఎన్టీఆర్ హయాం నుంచి మొదలై, చంద్రబాబు దశాబ్దాల నాయకత్వంలో ఎప్పుడూ ప్రత్యర్థుల దూకుడుపై చట్టపరమైన పోరాటాలు, రాజకీయ వ్యూహాలు, శాంతియుత నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంత రెచ్చగొట్టినా.. సంయమనం పాటించాలనేదే బాబు మార్క్ ఫిలాసఫీ. గడిచిన కొన్నేళ్లలో మారిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ప్రత్యర్థి వైసీపీ అనుసరించిన దూకుడు శైలి.. టీడీపీ శ్రేణులను తీవ్ర మనోవేదనకు గురిచేశాయ్. ప్రత్యర్థి దూకుడుగా వెళ్తున్నప్పుడు మనం పాతపద్ధతిలోనే ఉంటే నష్టం తప్పదనే భావన క్యాడర్‌లో బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరే.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నారా లోకేశ్ నాయకత్వం తెచ్చిన కొత్త ట్రెండ్, అగ్రెసివ్‌గా వెళ్లే విధానం పార్టీలో కొత్త జోష్ నింపింది. సోషల్ మీడియా వార్ నుంచి గ్రౌండ్ లెవెల్ దాకా.. యూత్ ఆలోచనలకే పార్టీలో ప్రాధాన్యం దక్కుతోంది. కార్యకర్తల నుంచి వస్తున్న ప్రెజర్‌తో.. హైకమాండ్ కూడా కొంతమేర ఫ్లెక్సీబిలిటీని ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

తమ్ముళ్లకు తెరవెనుక అండగా..

Advertisement

రాజకీయాల్లో చంద్రబాబు ఒక అడుగు ముందుకేయాలంటే ఎంతో ఆలోచిస్తారనే పేరుంది. ఇప్పుడు పార్టీలో కనిపిస్తున్న దూకుడుకు నో చెప్పకపోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందనే వాదన వినిపిస్తోంది. అందుకే, తమ్ముళ్లకు తెరవెనుక అండగా నిలుస్తూనే, ఎన్నికల వ్యూహాలు, జయహో బీసీ లాంటి బలమైన నినాదాలతో.. సామాజిక సమీకరణాలపైన తనదైన ముద్ర వేస్తున్నారనే చర్చ ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. కాలానికి తగ్గట్టుగా చంద్రబాబు తన రాజకీయ శైలిని మార్చుకున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రత్యర్థి దూకుడును తిప్పికొట్టడంలో క్యాడర్ చూపుతున్న తెగువ పార్టీకి అవసరమే! కానీ.. ఆ దూకుడు పార్టీ సిద్ధాంతాలను, ప్రజాస్వామ్య విలువలను దాటకుండా సీనియర్ల అనుభవం, యువ నాయకత్వం జోరుని బ్యాలెన్స్ చేయడం మీదే తెలుగుదేశం భవిష్యత్ ఆధారపడి ఉంది.

Also read: ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

Tags

Related News

కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!

ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

బుచ్చంపేటలో ఎంపీటీసీ ఏకగ్రీవంపై రచ్చ.. జక్కంపూడి రాజా ఎంట్రీతో మారిన సీన్!

సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

Big Stories

Advertisement
×