RTC Conductor: ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ఏదో రీజన్‌తో గొడవలు జరుగుతూనే ఉంటాయి. సీట్ల కోసం ప్యాసింజర్ల ఫైటింగ్ చిల్లర విషయంలో కండెక్టర్‌తో గొడవలు బస్టాండ్ దగ్గర ఆపలేదంటూ డ్రైవర్లపై తింట్లదండకం ఇలాంటి సీన్లు ఆర్టీసీ బస్సుల్లో రెగ్యూలర్‌గా జరుగుతూనే ఉంటాయి. మిగిలిన ప్యాసింజర్స్ సినిమా చూసినట్టు చూస్తారు. మరి జర్నీలో టైమ్ పాస్ కావాలి కదా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అలాంటి గొడవ జరిగింది. కానీ అది గొడవతో ఆగలేదు. ఆస్పత్రి బెడ్‌వరకు వెళ్లింది. ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య జరిగిన మామూలు వాగ్వాదం కాస్తా.. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అండ్ క్రైమ్‌కి దారితీసింది. అశ్వాపురం మండలం మిట్టగూడెం దగ్గర ఆర్టీసీ బస్సు వెళ్తోంది. చిల్లర విషయంలో ప్రయాణికురాలు, కండక్టర్ మధ్య చిన్న పంచాయితీ మొదలైంది. చూస్తుండానే ఇద్దరి మధ్యా మాట మాట పెరిగింది. వాగ్వాదం బస్సు ఇంజిన్ మాదిరి హీటెక్కింది. ఇక్కడితో ఆగిపోతే ఏ గొడవా లేదు. కానీ కోపం కళ్లకు గంతలు కట్టింది. వాగ్వాదం కాస్తా తోపులాటగా టర్న్ తీసుకుంది. ప్రయాణికురాలు ఒక్కసారి నెట్టేయడంతో కండక్టర్ బ్యాలెన్స్ తప్పి బస్సులోంచి రోడ్డుపై పడిపోయింది. అదే సెకనులో బస్సు టైరు ఆమె కాళ్ల మీదుగా దూసుకెళ్లింది. ఒక్క క్షణం ఆమె జీవితమే తలకిందులైపోయింది. ఆమె కాలుకు తీవ్రగాయమైంది.
తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ తోపులాట ఎలా మొదలైంది. ప్రయాణికురాలు కావాలనే నెట్టిందా, లేక ఆవేశంలో జరిగిన యాక్సిడెంటా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఒక్క టికెట్ కోసం కోపం కంట్రోల్ తప్పితే ఎంత ఘోరం జరుగుతుందో చెప్పే వార్నింగ్ బెల్ ఇది.
Also Read: ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?