Nara Lokesh: తమిళనాడు రాజకీయ యవనికపై దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించాడు నటుడు విజయ్. విజయ్ తృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. నేడు జరుగుతున్న కౌంటింగ్‌లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుండటంతో తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలైంది. సినీ రంగంలో తిరుగులేని దళపతిగా గుర్తింపు పొందిన విజయ్.. రాజకీయ అరంగేట్రంలోనే అదే జోరుతో సత్తా చాటారు. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం.
ఈ చారిత్రాత్మక విజయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “రాజకీయ అరంగేట్రంలోనే మీరు సాధించిన ఈ విజయం అద్భుతం. ఇది ఓటర్ల మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి.. బాధ్యత, నిబద్ధతతో ప్రజల కలలను నెరవేర్చే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను.” అని లోకేశ్ ఎక్స్ వేదికగా కొనియాడారు.
టీవీకే అఖండ విజయం ఖాయమవడంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వారసుడు గెలిచాడంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. బాణసంచా కాల్చుతూ, ఈలలు వేస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానుల తాకిడి పెరగడంతో పోలీసులు విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లను అమర్చారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో డీఎంకే కంచుకోటలను టీవీకే బద్ధలు కొట్టడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళనాడు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. విజయ్ తన ప్రచారంలో నిరుద్యోగం, అవినీతి, పారదర్శక పాలనపై ఇచ్చిన హామీలే ఈ విజయానికి పునాదిగా కనిపిస్తున్నాయి.
Congratulations to @TVKVijayHQ on an astounding electoral debut in Tamil Nadu. The outcome reflects the evolving aspirations of the state’s electorate and adds a new dimension to its political landscape. Wishing him the very best as he steps into public life and works towards…
— Lokesh Nara (@naralokesh) May 4, 2026
Read Also: రెండు సీట్లలో దూసుకుపోతున్న విజయ్, అదే జరిగితే రంగంలోకి త్రిష, అర గంటపాటు ఇంట్లో చర్చలు