Kerala Politics: బైబై పినరయి.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన స్లోగన్. ఇది చాలా పని చేసింది. నిజంగానే జనాలు పినరయి విజయన్ కు బైబై చెప్పేశారు. కేరళంలో ప్రచారం దగ్గర్నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కాంగ్రెస్ పకడ్బందీగా వ్యవహరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. విజయన్ కు ఖతర్నాక్ కౌంటర్లు ఇస్తూనే.. మలయాళీల్లో జోష్ నింపారు. ఇవన్నీ కలిసి వచ్చి UDF బంపర్ విక్టరీ అయితే కొట్టింది.
కేరళలో కాంగ్రెస్ దూకుడు
అంతే కాదు.. ఈ మొత్తం కేరళం ప్రచారంలో కాంగ్రెస్ హైకమాండ్ పకడ్బందీగా వ్యవహరించింది. తెలంగాణలో అధికారంలో ఉండడంతో కేరళంలో కాంగ్రెస్ కు చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే పాజిటివ్ వైబ్ అక్కడ కూడా పని చేసింది. అందుకే తెలంగాణ సీఎం, సహా మంత్రులకు ప్రచారాలను అసైన్ చేసింది. స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. మేనిఫెస్టో విడుదలలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రచారం చేసిన చాలా నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. చెప్పాలంటే బైబై పినరయి.. అన్న స్లోగన్ కేరళంలో పాపులర్ చేసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
కేరళలో రేవంత్ రోడ్ షోలు
సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తూ యూడీఎఫ్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. తిరువనంతపురం జిల్లా నేమం వంటి కీలక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. కొచ్చిలో రేవంత్ రెడ్డి యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కొల్లాం జిల్లాలోని పతనాపురం వంటి ప్రాంతాల్లోనూ పర్యటించారు. పాతూరాలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొని ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న విషయాన్ని హైలైట్ చేశారు. అటు తెలంగాణ మంత్రులు కూడా తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారంటీల మోడల్‌ను కేరళం ప్రచారంలో ప్రస్తావించారు.
రేవంత్ టార్గెట్ పినరయి!
ఏప్రిల్ లో కొచ్చిలో రేవంత్ ఇందిరా గ్యారంటీల పేరుతో UDF మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చీకటి యుగం ముగిసి గోల్డెన్ ఎరా వస్తుందని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, యువతకు లోన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఉన్నాయి. అలప్పుజ, ఎర్నాకుళం వంటి చోట్ల సీఎం రేవంత్ రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగ్స్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ ప్రచారంలో పినరయి విజయన్‌ను తీవ్రంగా విమర్శించారు. LDF వైఫల్యాలు, కరప్షన్, శబరిమల గోల్డ్ కేసు, బీజేపీతో సీక్రెట్ అండర్‌స్టాండింగ్ ఇలాంటి వాటిని హైలైట్ చేశారు. తెలంగాణ మోడల్‌ను ప్రచారం చేశారు. పినరయితో డిబేట్ కు కూడా సవాల్ చేశారు.
పినరయిపై రేవంత్ ఫైర్
రేవంత్ ప్రచారం యువత, కాంగ్రెస్ వర్కర్లలో ఎనర్జీ తీసుకొచ్చింది. పైగా కేరళంలో కేరళ vs తెలంగాణ రెండు మోడల్స్ డిబేట్ పై హీట్ పెంచారు. ఇది కాస్తా యాంటీ ఇన్‌కంబెన్సీని హైలైట్ చేసింది. సౌత్‌లో కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కవుట్ చేయడంలో సీఎం రేవంత్ కీ రోల్ అయితే పోషించగలిగారు. ఓవరాల్ గా చూస్తే రేవంత్ ఫ్యాక్టర్ UDF వేవ్ ని బలపరిచింది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ గా నియమించడంతో కథ మారిపోయింది. మలయాళం సినిమా నీ పో మోనే విజయన్ అని డైలాగ్ ను రేవంత్ వాడారు. వెళ్లిపో విజయన్, నీ టైమ్ ముగిసింది అంటూ మలయాళ సినిమా డైలాగ్‌తో విమర్శించారు. ప్రధాని మోడీ, విజయన్ ఇద్దరూ బ్రదర్స్ లాంటి వారని, విజయన్‌పై ఉన్న అవినీతి కేసుల వల్ల, దర్యాప్తు సంస్థలు రావొద్దన్న భయంతో మోడీని విజయన్ విమర్శించడం లేదని ఆరోపించారు. వీటితో పాటే విజయన్ పాలనతో కేరళం ఎలా నష్టపోయిందో ప్రచారాల్లో రేవంత్ ప్రస్తావించారు. ఇది వైరల్ అయి UDF క్యాంప్‌లో ఎనర్జీ పెంచింది.
రేవంత్-విజయన్ ట్వీట్ వార్ హైపీక్!
కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ వర్సెస్ సీఎం విజయన్ అన్నట్లుగా గేమ్ నడిచింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ట్వీట్ వార్ హైపిచ్ కు చేరింది. కేరళలో సమస్యలు, ప్రస్తుత సీఎం విజయన్ పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం.. విజయన్ ఎన్ కౌంటర్, ఆపై రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్లతో దేశ రాజకీయం అంతా ఈ ఇద్దరు సీఎంల విమర్శల చుట్టే తిరిగింది. లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అందరి అటెన్షన్ అటువైపే నడిచింది. కేరళం అభివృద్ధిపై తప్పుడు సమాచారంతో నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని విజయన్ మండిపడ్డారు.
రేవంత్‌పై విజయన్ ఫైర్
తెలంగాణలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న వ్యక్తి, కేరళంకు సామాజిక పురోగతి గురించి పాఠాలు చెప్పడం జోక్ అన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో అత్యల్ప అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని, తెలంగాణ 6వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. అలాగే అక్షరాస్యత, శిశు మరణాల రేటు వంటి అంశాల్లో కేరళ చాలా ముందుందని సోషల్ మీడియా పోస్ట్ లో ప్రస్తావించారు. అక్కడితో ఆగకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం నుంచి కేరళం నేర్చుకోవాల్సింది ఏమీ లేదని ఘాటుగా స్పందించారు విజయన్.
విజయన్‌కు రేవంత్ కౌంటర్
విజయన్ ఆ స్థాయిలో రియాక్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి కేరళం, తెలంగాణ సారూప్యతపై వివరణ ఇస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి 10.1 శాతంగా ఉందని, ఇది జాతీయ జీడీపీ 9.9 శాతం కంటే ఎక్కువ అన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ 16.12 లక్షల కోట్లు దాటిందని, దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ రెండో ర్యాంకులో ఉందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన 20 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు బీమా, క్రాప్ బోనస్ ఇలాంటి లెక్కలన్నీ విజయన్ కు రాసిన లేఖతో కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు.. నీతి ఆయోగ్ సూచీలో.. కేరళ తొలి స్థానంలో ఉందంటే.. అది కేరళలో ఏడు దశాబ్దాల ప్రభుత్వాలన్నింటి సమష్టి కృషి ఫలితమని సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
విజయన్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
అలా కేరళంలోని మేధావులను సీఎం రేవంత్ మెప్పించగలిగారు. అందరి కష్టాన్ని విజయన్ ఒక్కరి ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. అంతే కాదు కేరళం ప్రచారంలో విజయన్ తో డైరెక్ట్ డిబేట్ కు కూడా రెడీయే అని సవాల్ చేశారు. తెలంగాణలో ఉద్యోగులకు ఒకటోతేదీనే ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు సమాచారంతో వచ్చిన విజయన్ కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజయన్ ప్రభుత్వం బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి విచారణ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి కామెంట్స్ తో హీట్ పెంచారు. సో ఇవన్నీ వర్కవుట్ అయ్యాయి.
కేరళలో కాంగ్రెస్ గేమ్ చేంజర్
సో సీఎం రేవంత్ సహా తెలంగాణ మంత్రుల ప్రచారాలు UDF శిబిరంలో హై-ఎనర్జీ సృష్టించాయి. డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యాయి. ఎనర్జీ ప్లస్ గ్యారంటీలు ప్లస్ షార్ప్ అటాక్స్ వర్కవుట్ అయ్యాయి. అందుకే కేరళంలో UDF తిరుగులేని విజయాన్ని సాధించడంలో కీ రోల్ పోషించాయి.
Also Read: జవహర్ నగర్ వాసులకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డిని కలిసిన అఖిలపక్ష నేతలు.. డంప్ యార్డ్ అవుట్?