TVK Chief Vijay: తమిళనాడు రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఓ అంశంపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో రెండు నియోజకవర్గాల్లో టీవీకే చీఫ్, నటుడు విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల సరళిని చూస్తుంటే ఆయన రెండు చోట్లా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరొక సీటుకు రాజీనామా చేయనున్నారు.
రెండు సీట్లలో దూసుకుపోతున్న టీవీకే చీఫ్ విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన దిగ్గజ రాజకీయ పార్టీలను ఈ ఎన్నికల్లో చిత్తు చేశాడు. ప్రస్తుతం విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగాడు. అది ఆ పార్టీకి ఎంతో ఉపయోగపడింది. ఉత్తర తమిళనాడు నుంచి పెరంబూర్, దక్షిణ తమిళనాడు తిరుచిరాపల్లి తూర్పు నుంచి బరిలోకి దిగారు.
రెండు చోట్లా ప్రత్యర్థులపై దాదాపు 15 వేల మెజార్టీతో కొనసాగుతున్నాడు. రెండు చోట్ల విజయ్ గెలుపు దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల తర్వాత ఓ నియోజకవర్గానికి విజయ్ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆ సీటు నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అనేదానిపై చెన్నైలో రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.
అదే జరిగితే రంగంలోకి త్రిష.. అర గంటపాటు ఇంట్లో చర్చలు
విజయ్ ఒక సీటు రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి నటి త్రిషను రంగంలోకి దించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విజయ్ కేబినెట్‌లో ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ విజయ్ ఒక సీటులో గెలిచి, మరొక సీటులో ఓడిపోయినా త్రిషకు డిప్యూటీ సీఎంమని చెబుతున్నారు.
విజయ్-త్రిష గురించి ఎన్నికల ప్రచారంలో రకరకాల రూమర్లు వచ్చాయి. వారిద్దరు మంచి స్నేహితులని దగ్గరగా చూసినవాళ్లు చెబుతున్నమాట. ఎన్నికల ఫలితాలు వస్తున్నట్లు తిరుమల నుంచి నేరుగా త్రిష, విజయ్ ఇంటికి వెళ్లి కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పింది. త్రిషకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు విజయ్, ఆయన కుటుంబసభ్యులు. ఆ తర్వాత ఇరువురు అరగంటపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ALSO READ: బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. ముఖ్యమంత్రి పీఠంపై సువేందు అధికారి?
విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై విజయ్‌కు అభినందనలు తెలిపిన త్రిష
దాదాపు గంటన్నర సేపు విజయ్ ఇంట్లో చర్చలు
కారులో వెళ్తూ మీడియా ప్రతినిధులకు విక్టరీ సింబల్ చూపించిన త్రిష
Trisha comes out of Vijay's house. Trisha… https://t.co/kYjW0NXojP pic.twitter.com/r4SDCjbWvj
— BIG TV Breaking News (@bigtvtelugu) May 4, 2026