BigTV English

Venkatreddy Suspend: రంగంలోకి ఏసీబీ.. జగన్ పరిస్థితి ఏంటి ? వెంకట్‌రెడ్డి ఎక్కడ?

Venkatreddy Suspend: రంగంలోకి ఏసీబీ.. జగన్ పరిస్థితి ఏంటి ? వెంకట్‌రెడ్డి ఎక్కడ?

Venkat reddy suspend news(Latest andhra news in telugu): ఎవరికైనా కొద్దిరోజులు హంస.. మరి కొద్దిరోజులు హింస అన్నసామెత గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అతికినట్టు సరిపోతుంది. జగన్ ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహించిన ఆయన చుట్టూ ఉచ్చు బిగిసుకుంది. ప్రకృతి వనరులను అయినవారికి ఇష్టానుసారంగా కట్టబెట్టారు. న్యాయ స్థానాలు మొట్టికాయలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా వెంటకరెడ్డిని చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయన అక్రమాలను వెలికితీసే బాధ్యతను ఏసీబీకి అప్పగించింది.


ఎవరు వెంకటరెడ్డి? ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. రక్షణశాఖలో ఇండియన్ కోస్ట్‌గార్డులో సీనియర్ సివిల్ స్టాఫ్ అధికారిగా ఉన్న ఆయన డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చారు. అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డికి సన్నిహితుడు కూడా. 2020లో గనుల శాఖ డైరెక్టర్‌గా, 2021లో ఏపీ ఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఉచిత ఇసుకను రద్దు చేసి ఎండీసీ ద్వారా అమ్మకాలు జరిగాయి.

ఇసుక వేలం మొదలు వినియోగదారుడి వద్దకు చేరేవరకూ వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయన్నది కూటమి ప్రభుత్వం మాట. కోల్‌కత్తా కేంద్రంగా టెండర్లు నిర్వహించి జేవీ వెంచర్స్‌కు కట్టబెట్టాడు. ఇదికాకుండా నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ స్వార్జ్, బొగ్గు, ముగ్గురాయి వాటిలో అక్రమాలు చేసిన తేలింది. ఇందులో వైసీపీకి చెందిన పెద్ద తలకాయలున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ALSO READ: అప్పులు ఫుల్.. ఆదాయం నిల్: సీఎం చంద్రబాబు

చంద్రబాబు సర్కార్ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. వెంటనే ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా గురువారం ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గనులశాఖ ఇచ్చిన నివేదికను ఏసీబీకి పంపించారు. వెంకటరెడ్డి ఎక్కడికి పారిపోయాడు?

జూన్‌లో ఎన్నికల ఫలితాలు రాగానే వెంకట్ రెడ్డి అన్నీ సర్దుకున్నాడు. విజయవాడ కేసీపీ కాలనీలో ఏపీ ఎండీసీ అతిథిగృహంలో మూడున్నరేళ్లపాటు ఫ్యామిలీతో ఉన్నారు. జూలైలో ఖాళీ చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు ఫోన్ నెంబర్లు సైతం మార్చేశారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డి ఆచూకీ కోసం అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏసీబీకి వెంకటరెడ్డి చిక్కితే గడిచిన ఐదేళ్లలో జరిగిన అక్రమాల బాగోతం బయటపడడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ కీలక పెద్దలకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఓ వైపు లిక్కర్, మరో వైపు గనుల వ్యవహారాలపై చంద్రబాబు సర్కార్ ఏసీబీకి ఇవ్వడాన్ని జగన్ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related News

Aruna Custody: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు, వైసీపీ స్కెచ్ ఏంటి?

Village Clinics: ఏపీలో వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్‌

YSRCP: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Big Stories

×