BigTV English

Kakinada Sridevi: అరుదైన గౌరవం అందుకున్న కోర్టు బ్యూటీ.. అదృష్టం కదా!

Kakinada Sridevi: అరుదైన గౌరవం అందుకున్న కోర్టు బ్యూటీ.. అదృష్టం కదా!

Kakinada Sridevi: ఒకే ఒక్క సినిమా.. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్ ను అమాంతం పెంచేసింది అని చెప్పవచ్చు. ఎక్కడో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ కెరియర్ కొనసాగించిన కాకినాడ శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాలా.. నాని (Natural Star Nani) కోర్ట్ (Court )మూవీతో తన అదృష్టాన్ని మార్చేసుకుంది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఫేమస్ అయిపోయింది. తొలి సినిమాతోనే తన నటనతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ఇందులో జాబిలి పాత్రలో తన నటనతో యువతను మెప్పించింది. తొలి సినిమాకే ఎంతో పరిణతితో కూడిన నటనను ఆమె ప్రదర్శించింది. దీంతో అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక తమిళ్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


అరుదైన ఆహ్వానం అందుకున్న కోర్టు బ్యూటీ..

ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈమెకు మరో అరుదైన ఆహ్వానం లభించింది. ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ కు ఈమెను ఆహ్వానిస్తూ గామా అవార్డ్స్ బృందం ఒక సందేశం పంపించింది. ఇందుకు సంబంధించిన విషయాన్నీ శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒక్క మూవీ ఈమె అదృష్టాన్ని మార్చేసింది.. ఇది కదా నిజమైన అదృష్టం అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.


గామా అవార్డ్స్ వేడుకకు ఆహ్వానం..

విషయంలోకి వెళ్తే.. “గామా అవార్డ్స్ దుబాయ్ ప్రేక్షకుల మధ్య ఘనంగా వేడుక జరుపుకుంటోంది. ఈ షో కి ఇప్పుడు ఒక కొత్త నటి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈమెకు గామా తరఫున వెల్కమ్ చెబుదాం. కోర్టు మూవీలో జాబిలిగా నటించిన హీరోయిన్ శ్రీదేవి అప్పాల కాకినాడలో పుట్టి పెరిగింది. ఇంటర్ చదువుతోంది. కోర్టు సినిమాలో ఈమె నటనకు మంచి గుర్తింపు లభించింది. త్వరలోనే ఒక తమిళ్ సినిమాలో కూడా నటించనుంది. ఇండస్ట్రీలో మంచి నటిగా ఎదగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.. ఆమెకు స్వాగతం పలుకుదాం” అంటూ పోస్ట్ పెట్టింది.

శ్రీదేవి పై ప్రశంసల వెల్లువ..

ఇకపోతే దుబాయ్ వేదికగా జరగనున్న గామా అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. అయిదవ ఎడిషన్ ఆగస్టు 30న షార్జా ఎక్స్పో సెంటర్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాదులో ఇటీవల కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించగా.. 2024లో విడుదలైన చిత్రాలకు 24 క్రాఫ్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నారు. ఏది ఏమైనా గామా అవార్డ్స్ వేడుకకు ఆహ్వానం లభించడం నిజంగా ఒక అద్భుతమైన గౌరవం అని నెటిజన్స్ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కోర్ట్ మూవీ విశేషాలు..

శ్రీదేవి కోర్ట్ మూవీ విషయానికి వస్తే.. నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి, హర్షవర్ధన్, శివాజీ , రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం కోర్ట్. ఇందులో హర్ష్ రోహన్ హీరోగా నటించగా.. శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సెలబ్రిటీలను కూడా మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా వీరిపై ప్రశంసలు కురిపించారు.

ALSO READ:Film industry: స్టేజ్ పై నటిని అసభ్యంగా తాకిన హీరో.. ఆమె రియాక్షన్ చూసారా?

Related News

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Mahesh Babu: అమ్మో .. నా వల్ల కాదు.. షూటింగ్ క్యాన్సిల్.. మహేష్ తీరుపై మేకర్స్ అసహనం

Rag Mayur : ఐటీలో జాబ్.. సినిమాల వల్ల చాలా నష్టపోయాను.. రాగ్ మయూర్ సంచలన వ్యాఖ్యలు..

Sathyaraj: రజినీకాంత్ తో అందుకే నటించనని చెప్పా.. 18 ఏళ్ల వివాదానికి చెక్ పెట్టిన కట్టప్ప

Big Stories

×