BigTV English

CM Chandrababu: అప్పులు ఫుల్.. ఆదాయం నిల్: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అప్పులు ఫుల్.. ఆదాయం నిల్: సీఎం చంద్రబాబు

CM Chandrababu Comments: ఏపీలోని సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మడకశిర మండలం గుండుమలలో పెన్షన్ పంపిణీ, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. జగన్ కు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. 11 సీట్లలో 6 సీట్లు రాయలసీమ నుంచే వచ్చాయి. ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేశారో ఆలోచించుకోవాలి. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసానికి అంతే లేదు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రాయలసీమకు నిధులు ఇవ్వలేదు కానీ,.. జగన్ పత్రికలకు నిధులు ఇచ్చారు. ప్రభుత్వ నిధులను జగన్ ఇష్టానురీతిన ఖర్చు చేశారు.


వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా దోపిడీ, దౌర్జన్యాలే. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సినవారే దోపిడీ చేశారు. గత ప్రభుత్వంలో అప్పులు ఫుల్.. ఆదాయం నిల్. గత ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని నష్టం జరిగింది. సర్వే రాళ్లకు రూ. 700 కోట్లు ఖర్చు చేసి ఫొటో పెట్టుకున్నారు. పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ, రిషికొండలో ప్యాలెస్ కట్టారు.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. ‘ఆ పెన్షన్లు తీసేస్తాం’


రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం. సంపద సృష్టించి.. పేదలకు పంచడమే మా లక్ష్యం. ఏపీలో కూటమి ద్వారా జవాబుదారీ పాలన. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ. మేం పాలకులం కాదు.. సేవకులం. మాది ప్రజాప్రభుత్వం.. ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. రాళ్ల సీమను రత్నా సీమగా మారుస్తాం. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయంతోపాటు ఉపాధి కల్పన. గతంలో మేం సాగునీటికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఐదేళ్లలో రూ. 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కరువు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం.

అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తాం. మడకశిరలో రూ. 60 కోట్లతో రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తాం. ఆగలి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. అవకాశం ఉంటే మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం.

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ఓపెన్ చేస్తాం. పేదల కడుపు నింపే బాధ్యత తీసుకుంటాం.

Related News

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

Tirumala News: తిరుమల కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళల్లో ఆనందం, కాకపోతే

Big Stories

×