Aruna Custody: పోలీసుల విచారణలో నిడిగుంట అరుణ నిజాలు బయట పెడుతుందా? విచారణకు ఆమె సహకరిస్తుందా? రాబట్టాల్సిన అసలు విషయాలేంటి? ఆమె చీకటి బాగోతాలను పోలీసులు వెలికి తీస్తారా? అరుణ నాలుగైదు ఫోన్లలో డేటా బయటకు వస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
గడిచిన నాలుగైదేళ్లు నెల్లూరుని గడగడలాడించింది నిడిగుంట అరుణ. ఆమెని గురువారం నుంచి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. గురువారం ఒంగోలు జైలు నుంచి కొవూరు పోలీసుస్టేషన్‌కు ఆమెని తీసుకువచ్చారు. కొంత సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విచారణకు నేడు, రేపు జరగనుంది.
పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పలు నేరాలతో సంబంధమున్న అరుణ విచారణలో ఎలాంటి విషయాలు బయటపెడతారన్నది పోలీసులు, రాజకీయ నేతల్లో ఆసక్తి నెలకొంది. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో ఓ అపార్టుమెంట్‌లో ఫ్లాటును ఆక్రమించిన కేసులో అరెస్టయ్యింది ఆమె. 19న నుంచి రిమాండ్‌పై ఒంగోలు జైలులో ఉంది.
అరుణపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఇప్పటికే పోలీసుస్టేషన్‌కు క్యూ కడుతున్నారు. అరుణ-రౌడీషీటర్ శ్రీకాంత్ మధ్య ఉన్న లావాదేవీలేంటి? బలవంతపు వసూల్లు, గంజాయి, రెండ్ శాండిల్స్ గ్యాంగులతో వీరికి ఉన్న సంబంధాలేంటి? కాంట్రాక్ట్ హత్యలపై పోలీసులను ఆమెని ప్రశ్నించనున్నారు.
ALSO READ: ఏపీలో వైద్య సేవలకు మహర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్
పోలీసు అధికారులను భయపెట్టి లొంగదీసుకున్న ఈమె, విచారణకు సహకరిస్తుందా? అన్నది పాయింట్. పోలీసు బాసులతో సీక్రెట్ లింకులు, రాజకీయ నేతలతో స్నేహ సంబంధాలు బయటకు వస్తాయా? అంతేకాదు అరుణ ఇప్పటివరకు వాడిన నాలుగైదు పోన్లు, వాటిలో డేటాను బయటకు తీయాల్సి వుంది.
సీక్రెట్ ఫోల్డర్ లో దాచిన ఆడియో, వీడియోల ఫైళ్లు బయటకు వస్తే రాష్ట్రానికి ఓ కుదుపు కుదిపేయడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎస్ నుంచి సెక్రటేరియట్ వరకు చాలామంది అధికారుల జాతకాలు బయటపడతాయని అంటున్నారు. అరుణ గ్యాంగ్ ఎన్ని కోట్లు సంపాదించింది?
అరుణ నడిపించిన గ్యాంగులో కీలక వ్యక్తులెవరు? ఆ గ్యాంగ్ ఎన్ని హత్యలు చేసింది? ఇలాంటి విషయాలు బయట పెడతే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు బాధితులు. ఇదే సమయంలో ఆమెని బెయిల్‌పై బయటకు తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేసినట్టు వార్తలు హంగామా చేస్తున్నాయి.
ప్రభుత్వం, హోంమంత్రిపై ఆమె చేత విమర్శలు చేయించి బురద జల్లాలనే కుట్రకు పథకం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూటమి డిఫెన్స్‌లో పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అరుణ నుంచి కీలక విషయాలు రాబడతారా? లేదా అన్నది చూడాలి.