BigTV English
Advertisement

NARI 2025: ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ బెస్ట్, మరి వరెస్ట్ నగరం ఏదో తెలుసా?

NARI 2025: ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ బెస్ట్, మరి వరెస్ట్ నగరం ఏదో తెలుసా?

NARI 2025: మహిళా భద్రతకు సంబంధించి జాతీయ వార్షిక నివేదిక ‘NARI 2025’ విడుదల అయ్యింది. ఈ నివేదిక ప్రకారం, నగర, పట్టణ ప్రాంతాల్లోని 40% మంది మహిళలు సురక్షితంగా లేనట్టు వెల్లడించారు. ఈ అధ్యయనం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కవర్ చేసేలా 31 నగరాల్లో నిర్వహించారు. 12,770 మంది మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు.


సురక్షిత నగరాల్లో విశాఖకు చోటు

‘NARI 2025’  నివేదిక ప్రకారం అసురక్షిత నగరాల్లో రాంచీ, శ్రీనగర్, కోల్‌ కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పాట్నా, జైపూర్ నిలిచాయి. అత్యంత సురక్షితమైన నగరాల్లో కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌ టాక్, ఇటానగర్, ముంబై నగరాలు నిలిచాయి.


మహిళలకు ఎదురయ్యే వేధింపులు ఇవే!

దేశంలో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారు. తదేకంగా చూడటం, కేకలు వేయడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, అనుచితంగా శారీరకంగా తాకడం లాంటి ఘటనలు ఉన్నాయి. ఈ కారణాలతో చాలా మంది యువతులు చదవు, మహిళలు ఉద్యోగాలు వదులుకున్నట్లు‘NARI 2025’  నివేదిక తెలిపింది. 2024లో 7 శాతం మంది మహిళలు తాము వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. వీరిలో ఎక్కువగా 18-24 సంవత్సరాల వయస్సు గల యువతులు ఉన్నారు. చాలా మంది మహిళలు వేధింపుల గురించి ఎవరికీ చెప్పడం లేదని తేలింది. ఒకవేళ బయటకు చెప్తే మరింత వేధింపులకు గురవుతారని భయపడి చెప్పడం లేదు. 22 శాతం మంది వేధింపుల గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తే, అందులో కేవలం 16 శాతం కేసులలో మాత్రమే చర్యలు తీసుకున్నట్లు వివరించింది.

‘NARI 2025’ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కీలక వ్యాఖ్యలు

తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ‘NARI 2025’ను విడుదల చేశారు. జాతీయ మహిళా కమిషన్‌లో, ప్రతి స్త్రీ ఇంట్లో, పని ప్రాంతంలో, బహిరంగ ప్రదేశాలలో, ఆన్‌ లైన్‌ లో సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే తమ ప్రాధాన్యత అన్నారు. ఈ నివేదిక అన్ని రాష్ట్రాలకు చెందిన 31 నగరాల్లో అభిప్రాయాల సేకరణ తర్వాత రూపొందించినట్లు తెలిపారు. 12,700 మందికి పైగా మహిళల నుంచి వివరాలను సేకరించినట్లు తెలిపారు. విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, పౌర సమాజం మహిళలకు సురక్షితమైన, మరింత సమగ్రమైన నగరాలను రూపొందించడానికి కృషి చేయడంలో సహాయపడటానికి NARI 2025 నివేదిక వార్షిక ప్రమాణంగా ఉపయోగపడుతుందని విజయ వెల్లడించారు. మహిళలు తమకు ఎక్కడ, ఏరకమైన వేధింపులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. బయటకు చెప్పేందుకు భయపడితే, ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. భయపడకుండా ఫిర్యాదు చేయడం వల్ల మరోసారి అలాంటి వేధింపులు జరిగే అవకాశం ఉండదన్నారు. మహిళలు తమకు తాము రక్షణ చర్యలు తీసుకోవాలని విజయ సూచించారు.

Read Also:  డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..

Related News

Drinking Water: నీళ్లు తాగడం మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు

Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. కారణం స్కూల్ బ్యాగ్ ఒత్తిడేనా?

Calcium Rich Fruits: కాల్షియం లోపమా ? ఈ ఫ్రూట్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

Pomegranate: దానిమ్మ తింటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Big Stories

×