BigTV English

The 100: ఓటీటీకి సడెన్ గా ఆర్కే నాయుడు సినిమా

The 100: ఓటీటీకి సడెన్ గా ఆర్కే నాయుడు సినిమా

The 100: మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్. ఆ సీరియల్ లో చేసిన ఆర్కే నాయుడు పాత్ర ఎంత గుర్తిపు తెచ్చింది అంటే.. ఆర్కే అనే పేరును ఆయన పేరు ముందు పెట్టుకొని ఆర్కే  సాగర్ గా మారాడు. సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో హీరోగా మారి టాలీవుడ్ లో పాగా వేయడానికి కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్కే సాగర్ నటించిన చిత్రం ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటించగా ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రలో నటించింది. పోలీస్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. అయితే ఆశించిన కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది.


ఇక నెల రోజుల తరువాత ది 100 ఓటీటీ బాట పట్టింది. అయితే ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే ఓటీటీలో ది 100 ను రిలీజ్ చేశారు. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నేటి నుంచి ది 100 సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని డైరెక్టర్ అధికారికంగా చెప్పుకొచ్చాడు. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.  కథ బావుంటే థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా ఓటీటీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి.

ఇక ది 100 కథ విషయానికొస్తే.. ఐపీఎస్ అధికారి విక్రాంత్ (ఆర్‌కే సాగర్) ఎన్ కౌంటర్లు చేయకుండా డ్యూటీ  చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంటాడు. అసలు తుపాకీ కూడా వాడకూడదు అనుకుంటాడు. హైదరాబాద్ బయటి ప్రాంతాల్లో ఒక్కొక్క అమావాస్య రాత్రి జరిగే దొంగతనాలు మరియు హత్యల సిరీస్‌ ను ఛేదించాలని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. దొంగతనాల సమయంలో భరతనాట్య డాన్సర్ ఆర్తి (మిషా నారంగ్)పై అత్యాచారం జరుగుతుంది. ఈ విషయాన్ని విక్రాంత్ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఆ కేసు ఇంకా పరిష్కారం అవ్వకముందే మధు ప్రియ (విష్ణు ప్రియ) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకుంటుంది, ఆమె డెత్ నోట్ షాకింగ్ రివెలేషన్లు తెలియజేస్తుంది. ఇక వీటన్నింటికి కారణం ఎవరు.. ? తుపాకీ వాడకూడదు అనుకున్న విక్రాంత్ ఎందుకు వాడాల్సివచ్చింది. అసలు ది 100 అంటే ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేని ఈ సినిమా ఓటీటీలో ఎలా దూసుకుపోతుందో చూడాలి.


Related News

Rag Mayur : ఐటీలో జాబ్.. సినిమాల వల్ల చాలా నష్టపోయాను.. రాగ్ మయూర్ సంచలన వ్యాఖ్యలు..

Kakinada Sridevi: అరుదైన గౌరవం అందుకున్న కోర్టు బ్యూటీ.. అదృష్టం కదా!

Sathyaraj: రజినీకాంత్ తో అందుకే నటించనని చెప్పా.. 18 ఏళ్ల వివాదానికి చెక్ పెట్టిన కట్టప్ప

Akkineni Nagarjuna: నాగార్జున బర్త్ డే స్పెషల్.. టాలీవుడ్ మన్మధుడి ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే..?

Film industry: స్టేజ్ పై నటిని అసభ్యంగా తాకిన హీరో.. ఆమె రియాక్షన్ చూసారా?

Big Stories

×