Akkineni Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున పేరు తెలియని వాళ్ళు ఉండరు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. అప్పటినుంచి ఇప్పటికీ తరగని అందం ఆయన సొంతం. అందరూ ఆయన్ని ముద్దుగా మన్మధుడు అని పిలుచుకుంటారు. ఇద్దరు కొడుకులకు పెళ్లి అయినా కూడా కుర్ర హీరోలకు పోటీని ఇచ్చే అందంగా ఉంటాడు. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఆయన లాంటి అబ్బాయి కావాలని కలలు కంటున్నారు. ఈ వయసులో కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా తమిళ హీరోలతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. కుబేర, కూలీ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇక నేడు టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున పుట్టినరోజు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం నాగార్జున ఆస్తులు ఎన్ని వేల కోట్లో ఒకసారి తెలుసుకుందాం..
కింగ్ నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
అక్కినేని నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఆయన తండ్రి ఆస్తి కూడా నాగార్జునకే చెందడంతో వారసత్వంగా వచ్చిన ఆస్తితోపాటు నాగార్జున పలు బిజినెస్ లు కూడా చేస్తున్నారు. వాటి వల్ల మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ఇదే కాకుండా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్, ఎన్ కన్వెన్షన్ సెంటర్స్, రెస్టారెంట్స్‌ను ఆయన నిర్వహిస్తున్నారు.. అంతే కాదు ఆయన రెమ్యూనరేషన్ కూడా పాతిక కోట్లకు పైగానే ఉంటుంది.. దాంతో ప్రతి ఏడాది నాగ్ ఆస్తులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3700 కోట్లకు పై మాటే అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తన భార్య పేరు మీద కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. వాటి గురించి కరెక్ట్ గా లెక్కలు తెలీదు కానీ అవి కూడా బాగానే ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
Also Read : ఓరి నాయనో.. ఈ అమ్మాయి మామూల్ది కాదు.. ఓటు కోసం ఏకంగా..
బాలనటుడుగా కెరీర్ స్టార్ట్..
అక్కినేని నాగేశ్వరరావు ఎంత మంచి నటుడో అందరికి తెలుసు.. అప్పట్లో నందమూరి తారకరామారావు నాగేశ్వరరావు సినిమాలంటే జనాలకు పిచ్చి. వీళ్ళ సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో వందల సినిమాలో నటించిన నాగేశ్వరరావు ఆయన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాను నటించిన వెలుగు నీడలు, సుడిగుండాలు సినిమాలలో బాలనటుడుగా నటించారు నాగార్జున.. 1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు అక్కినేని నాగార్జున.. ఈ సినిమా అప్పుడు విమర్శలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. అలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ నవమన్మధుడుగా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.. ఇలాగే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వందేళ్లు జీవించాలని కోరుకుంటుంది బిగ్ టీవీ.. హ్యాపీ బర్త్ డే నాగార్జున..