E-Paper
Advertisement

Arava Sridhar: వైసీపీతో నాకు సంబంధం లేదు.. తాతంశెట్టి నాగేందర్ ఆరోపణలకు వీణ కౌంటర్

Arava Sridhar: వైసీపీతో నాకు సంబంధం లేదు.. తాతంశెట్టి నాగేందర్ ఆరోపణలకు వీణ కౌంటర్
Advertisement

Arava Sridhar: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు వీణ, తాజాగా మీడియా ముందుకు వచ్చి తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రలోభాలతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నానన్న వాదనలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒక సాధారణ మహిళగా తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకే తాను మీడియాను ఆశ్రయించానని వివరించారు.

వీణ తన వివరణలో ఎమ్మెల్యే శ్రీధర్ గత రాజకీయ నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. శ్రీధర్ గతంలో వైసీపీ నుంచి ముక్కవారిపల్లి సర్పంచ్‌గా పనిచేశారని, ఒకవేళ రాజకీయ కోణంలో మాట్లాడాలనుకుంటే తాను అప్పుడే మాట్లాడేదాన్ని అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన జనసేన ఎమ్మెల్యే కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నానే తప్ప, ఏ పార్టీపై ద్వేషంతో కాదని పేర్కొన్నారు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగిని అని, తన శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ గారేనని చెబుతూ, పార్టీలకు సంబంధం లేకుండా కేవలం న్యాయం కోసమే పోరాడుతున్నానని తెలిపారు. నిన్నటి ప్రెస్ మీట్‌లో కొందరు మీడియా ప్రతినిధులు తనతో వెటకారంగా, కామెడీ చేస్తూ మాట్లాడటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

టీడీపీ నాయకుడు తాతంశెట్టి నాగేందర్ చేసిన ఆరోపణలపై వీణ ఘాటుగా స్పందించారు. 2012 నుంచి తన బయోడేటా తీసి, ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెబుతూ తన క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూడటం సరికాదని హితవు పలికారు. సదరు వ్యక్తులు తనకు స్నేహితులా లేక మరేదైనా సంబంధం ఉందా అనేది నాగేందర్ ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. కేవలం పేర్లు చెబితే ఊరుకోనని, ఆరోపణలు చేసే వారు ప్రూఫ్స్ చూపించాలని సవాల్ విసిరారు. ఒక మహిళపై నిందలు వేసేటప్పుడు కనీస బాధ్యత ఉండాలని ఆమె సూచించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూ. 25 కోట్ల నగదు డిమాండ్ ఆడియోపై కూడా వీణ స్పష్టతనిచ్చారు. ఆ వాయిస్ తనది కాదని, కేవలం 29 సెకన్ల ఎడిట్ చేసిన ఆడియోను చూపించి తనపై నిందలు వేయడం తగదని అన్నారు. ఆ ఆడియోలో తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం మాట్లాడుతున్నానో పూర్తి ఆడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తరపు వారు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం తననే కాకుండా, ఎమ్మెల్యేను కూడా అదే స్థాయిలో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె అడిగారు. త్వరలోనే అన్ని విచారణల్లో నిజానిజాలు బయటపడతాయని, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని వీణ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: Janasenani : జనసేనానికి కొత్త చిక్కులు.. వైసీపీకి ఇది అస్త్రం కానుందా?

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×