ఏడాది మొత్తం కష్టపడినా.. పట్టుమని పది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోలేని బతుకులు ఎన్నో. ఎంత సంపాదిస్తామో అంతా.. ఖర్చులకే పోతుంది, ఇక సేవింగ్స్ ఎలా సాధ్యం అని చాలామంది బాధపడుతుంటారు. రోజు గడవటం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అయితే, ఈ యువతి మాత్రం ఏ ఉద్యోగం, వ్యాపారం చేయకుండా.. కేవలం మూడేళ్లలో రూ.900 కోట్లు సంపాదించింది. అదెలా అని ఆశ్చరపోతున్నారా? అది తెలియాలంటే.. ముందు మీరు ఆమె కథ తెలుసుకోవాలి.
ఆమె పేరు సోఫియా రైన్. 18 ఏళ్ల వయస్సు రాగానే ఆమె కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఈజీగా డబ్బులు సంపాదించి పెట్టే మార్గాలు వెతికింది. అప్పుడే.. ఆమెకు ‘OnlyFans’ గురించి తెలిసింది. ఇంకేం ఉంది వెంటనే.. అందులో జాయిన్ అయిపోయింది. మొదట్లో.. మేకప్, ఎక్సర్‌సైజ్, డ్రెస్సింగ్, మోడలింగ్ వంటి వీడియోలు పెట్టేది. సాంప్రదాయినీ.. సుప్పినీ స్టైల్‌లో బిల్డప్ ఇచ్చేది. అయితే, పెద్దగా సబ్‌స్క్రైబర్స్ రాకపోవడంతో.. ప్లాన్-బి అమలు చేసింది. మొత్తం విప్పి చూపడం మొదలుపెట్టింది. ఇంకేముంది.. సబ్‌స్క్రైబర్లు అమాంతంగా పెరిగాయి. ఆమెను దుస్తులు లేకుండా చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో.. రాత్రికి రాత్రి ఆమె కోటీశ్వరరాలు అయిపోయింది. అయితే, ఈ మాట అంటే ఆమె అస్సలు ఒప్పుకోదు. అది నా మూడేళ్ల కష్టార్జితం అంటుంది. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ.. మరోసారి ఇదే పాట పాడింది.
నేను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని కాలేదని.. ఆ వచ్చిన ఆదాయం గత మూడేళ్ల కష్టమని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె ‘ఓన్లీఫ్యాన్స్’ వెబ్‌సైట్ అకౌంట్‌ను చూపించింది. అందులో ఆమె ఆదాయం 100 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం సుమారు రూ.912 కోట్లు. రైన్‌ను ప్రస్తుతం 21 ఏళ్లు. 2022 నుంచి ఆమె ఓన్లీ ఫ్యాన్స్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. సబ్‌స్క్రీప్షన్ తీసుకున్నవారికి ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు పంపిస్తూ డబ్బులు సంపాదించింది. కేవలం సబ్‌స్క్రీప్షన్లతోనే ఆమెకు నెలకు రూ.11 కోట్లు చొప్పున ఆదాయం వస్తున్నట్లు సమాచారం.
రైన్ ఒక్క విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటోంది. తన ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్లో ఇప్పటివరకు ఒక్క ఇంటిమేట్ వీడియో కూడా పోస్ట్ చెయ్యలేదు. కేవలం తన స్వయంతృప్తి వీడియోలను పోస్ట్ చేస్తుంది. వాటిని చూసేందుకే జనాలు ఎగబడుతున్నారు. ఇందులో ఆమె ఎవరినీ పార్టనర్‌గా చేర్చుకోలేదు. తన అందాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తోంది. ఇలాంటి వీడియోలు చేస్తున్న అమ్మాయి తప్పకుండా వెర్జిన్ కాదని అనుకుంటారు. కానీ, ఆమె మాత్రం తాను ఇంకా కన్యనే అని చెబుతోంది.
‘‘నా ఆదాయాన్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. తాము కూడా నాలాగే సంపాదించాలని ఓన్లీఫ్యాన్స్‌లోకి వస్తారు. వారికి నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఇది అందరూ అనుకుంటున్నట్లుగా సులభమైన పని కాదు. నాలా అందరికీ ఆదాయం రాకపోవచ్చు. కొంతమంది రూ.11 వేలకు మించి ఆదాయం రావడం లేదు. కేవలం లక్ ఉంటేనే ఇందులో రాణించగలం. అంతేకాదు.. ఇందులో ఎన్నోరకాల వేధింపులను ఎదుర్కోవల్సి వస్తుంది. సమాజం మనల్ని చెడ్డవారిగా జడ్జ్ చేస్తుంది. ఇవన్నీ భరించడం చాలా కష్టం. ఇలాంటి మార్గాన్ని ఎవరూ ఎంచుకోవద్దు’’ అని చెబుతోంది. ఆమె చెప్పిన విషయంలో కూడా తప్పులేదు. ఆమెను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోకపోవడమే మంచిది.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే ఓన్లీ ఫ్యాన్స్ పనిచేస్తుంది. అయితే, మనకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియాల్లో ఏది పడితే అది పోస్ట్ చేయలేం. ముఖ్యంగా న*గ్నత్వానికి అనుమతి లేదు. కానీ, ఓన్లీ ఫ్యాన్సులో అలాంటి అడ్డంకులు ఏవీ ఉండవు. కంటెంట్ క్రియేటర్లు ఏమైనా చేయొచ్చు. ఏమైనా చూపించవచ్చు. దాని వల్లే వారికి ఆదాయం వస్తుంది. సబ్‌స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. తాజా ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రీప్షన్స్ ద్వారా కొంతమంది యువతులు, సెలబ్రిటీలు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
Also Read: బొద్దింకలు మనుషులను తింటాయా? వాటికి ఏయే శరీర భాగాలు ఇష్టమంటే?