ఏపీ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే చేసిన పని ప్రస్తుతం జనసేనానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టినట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు ఆయన సంక్షేమం, అభివృద్ధి అంటూ బిజీగా ఉన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నెరవేరుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సైతం ఆయన నేటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం కూటమిలో భాగమైన జనసేన.. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యచరణతో ముందుకు వస్తుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే, ఇదే సమయంలో ఒకరిద్దరూ ఎమ్మెల్యేల తీరు వలన ఏకంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుతం ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది.
ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న చిలిపి చేష్టలు ఒక్కసారిగా బయటకు రావడంతో ఇంతకాలం క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీలకు ప్రజల్లో చెడ్డ పేరు వస్తున్నది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగత జీవితంలో గానీ, రాజకీయపరంగా గానీ ఎటువంటి రీమార్క్ లేదు. ఆయన పార్టీని స్థాపించిన పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. చివరకు కూటమి ఏర్పడి అధికారంలోకి వచ్చాక.. తమను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిన అధినేతకు ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తెస్తున్నారంటూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అయితే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన పని కేవలం ఆయన కెరీర్‌కే కాకుండా జనసేనకు కూడా మాయని మచ్చగా మారిందని తోటి శాసన సభ్యులు సైతం అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినిని వేధించడంతో పాటు లైంగికంగా లోబరుచుకుని మోసం చేశారనే ఆరోపణలు ప్రస్తుతం జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఉన్నాయి. ఆయన తనను గర్భవతిని చేసి అబార్షన్ చేయించారని సదరు బాధిత మహిళా మీడియా ముందుకు వచ్చింది. అయితే, ఇదంతా ఆమె చేస్తున్న డ్రామా? అని తన కొడుకుని ట్రాప్ చేశారని అరవ శ్రీధర్ తల్లి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పవన్ కళ్యాన్ ఇంతవరకూ స్పందించలేదు. ఆయన రియాక్షన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా, తనను కావాలనే ఇరికించారని, సదరు మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఆయన సైతం మీడియా ముందుకు వచ్చి వివరించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు? చివరి అంకానికి
కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏ తప్పు చేస్తుందా? దాన్ని అస్త్రంగా మార్చుకుందామా? అని ప్రతిపక్ష వైసీపీ ఎదురుచూస్తున్నది.తీరా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వారు ఊరుకుంటారా? ఏకీపారేస్తారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో కూటమి సర్కార్ పనితనం ఇది అని.. ఈ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వైసీపీ మహిళా నేతలు విడుదల రజిని, మాజీమంత్రి రోజా సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ సైతం ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎటువంటి ముగింపు ఇస్తారో వేచిచూడాల్సిందే.