Surat Fire: గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలితీసుకున్నాయి. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతులలో నలుగురు మహిళలు , ఒక నాలుగేళ్ల బాలుడు ఉండటం అందరినీ కలిచివేస్తోంది.
ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణం భవనంలో నిల్వ ఉంచిన చీరల ప్యాకింగ్ మెటీరియల్ అని తెలుస్తోంది. ప్యాకింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్, ఇతర దహనశీల పదార్థాల వల్ల మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే భవనం అంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అగ్ని కీలల కంటే కూడా, ఆ భయంకరమైన పొగ కారణంగా ఊపిరాడక బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యల సమయంలో కొందరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివాస ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకరమైన మెటీరియల్‌ను నిల్వ ఉంచడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ట్యాక్స్ నుంచి టికెట్ దాకా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ కొత్త రూల్స్!
సూరత్ లో ఘోర అగ్ని ప్రమాదం
మూడంతస్థుల భవనంలో మంటలు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
చీరల ప్యాకింగ్ మెటీరియల్ కారణంగా మంటలు
దట్టమైన పొగతో ఊపిరాడక చనిపోయిన ఐదుగురు
మృతుల్లో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు
Five members of the same family died in a horrific fire accident in… pic.twitter.com/ILyxRPKxdX
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2026