E-Paper
Advertisement

Cockfights: పందెం రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం.. నున్నలో కోడి పందాల బరులు ధ్వంసం!

Cockfights: పందెం రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం.. నున్నలో కోడి పందాల బరులు ధ్వంసం!
Advertisement

Cockfights: పల్లెటూరి లోగిళ్లలో సంక్రాంతి అంటేనే ఒక కొత్త వెలుగు. అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో పందెం రాయుళ్లు ఒక్కసారిగా యూక్టివ్ అయిపోతారు. పుంజులకు శిక్షణ ఇవ్వడం, రహస్య ప్రాంతాల్లో బరిని సిద్ధం చేయడం.. ఇలా పక్కా స్కెచ్‌లతో ప్లాన్లు రెడీ చేసుకుంటారు. లక్షల రూపాయలు చేతులు మారే ఈ జూదానికి సంప్రదాయం అనే ముసుగు వేసి సిద్ధమైపోతారు. కానీ..  అసలు ట్విస్ట్ ఇక్కడే మెుదలవుతుంది. పందెం రాయుళ్లు ఒకవైపు ఎత్తుగడలు వేస్తుంటే.. మరోవైపు పోలీసు నిఘా నీడలా వెన్నాడుతూనే ఉంటుంది. అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయితే ఏమవుతుందో పక్కన పెడితేే.. ఈ లోపు  పోలీసులకు సమాచారం అందితే.. ఆ తర్వాత జరిగే సీన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం..

విజయవాడ శివార్లలో సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని కోడి పందాల నిర్వహణకు సిద్ధమైన పందెం రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నున్న ప్రాంతంలోని వికాస్ కాలేజీ రోడ్డులో భారీ ఎత్తున కోడి పందాల బరులను ఏర్పాటు చేసి..  చట్టాన్ని సవాల్ చేసేలా వ్యవహరించిన నిర్వాహకుల ప్లాన్‌ను పోలీసులు ముందే పసిగట్టి అడ్డుకున్నారు.

Advertisement

విజయవాడలో పందెం రాయుళ్లు బరితెగించారు. పండుగ మూడు రోజులు కోడి పందాలు పెట్టేద్దామంటూ అందరూ కూర్చొని మరి ఏంచేయాలో చర్చించుకున్నారు. నున్నలోని వికాస్ కాలేజీ రోడ్డులో కోడి పందాలు ఎలా నిర్వహించాలి ఎవరికి ఎంత ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు 10 లక్షలు ఇచ్చేందుకు డీల్ సెట్ చేశామంటూ చెప్పుకొచ్చారు కోడి పందాల బరి నిర్వాహకులు.

ఇటు ఎక్సైజ్ అధికారులకు మినహా మిగతా వారికి ఇచ్చేది అదనం అంటూ మాట్లాడుకున్నారు. కోళ్ల పందాలు జరిగే మూడు రోజులు సీఐ దగ్గరకు వెళ్లాల్సిందే.. కేసులు రాయించుకోవాల్సిందేనని ముందే డిసైడ్ అయ్యారు. అయితే కోడి పందాలు మాత్రం యథావిధిగా జరుగుతాయని బరి నిర్వాహకులు గ్యారంటీ కూడా ఇచ్చారు.

Advertisement

ఘటనపై సీరియస్ అయ్యారు సీపీ రాజశేఖర్‌ బాబు. విజయవాడ నున్నలోని కోడి పందాల బరులపై దాడులు చేశారు. ఏసీపీ స్రవంతి రాయ్ అధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. కోడి పందాల బరులను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు పికెట్ ఏర్పాటు చేశారు.

ALSO READ:  గ్రీన్‌లాండ్ జోలికొస్తే కాల్చిపడేస్తాం.. డెన్మార్క్ Vs ట్రంప్

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×