E-Paper
Advertisement

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన.. అక్కడ కూడా నేనే, భయంలో చాలా దేశాలు

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన.. అక్కడ కూడా నేనే,  భయంలో చాలా దేశాలు
Advertisement

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే కొన్నిదేశాలను భయంతో వణుకుతున్నాయా? పలు దేశాలపై ఆయన దండయాత్ర మొదలుపెట్టారా? ఆయన పేరు చెబితే పలు దేశాలకు వణుకు మొదలైందా? ఆయిల్ కోసం ఆయన ఈ పని చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు మాత్రం అవుననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. తాజాగా వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించున్నారు ట్రంప్. 

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన

Advertisement

సోమవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తానుగా ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్‌ చేశారు. ప్రపంచ చరిత్రలో ఈ తరహా ప్రకటన ఇదే తొలిసారి. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఫొటో కనిపించింది.

ట్రంప్‌ ఫొటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఉంది.  ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, తన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు. ప్రత్యర్థులను భయపెట్టడం, వినపోతే బలవంతంగా లొంగ దీసుకోవడం ఆయన నైజంగా కనిపిస్తోంది. 

ట్రంప్ వార్నింగ్.. భయంలో చాలా దేశాలు

ట్రంప్ వ్యవహారశైలిని గమనిస్తున్న పలు దేశాల నేతల్లో అప్పుడే భయం మొదలైంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో జనవరి మొదటివారంలో వెనిజులాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఈనెల 3న రాజధాని కారకస్ సిటీపై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యని బంధించి అమెరికాకు తీసుకెళ్లారు.

వెనిజులాపై అమెరికా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి కూడా. ఇప్పుడు ఏకంగా వెనిజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చాలా దేశాలను అంతుపట్టడం లేదు. 

వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను ఆదేశ తాత్కాలిక అధ్యక్షురాలిని చేర్చింది అక్కడి సుప్రీంకోర్టు. ప్రస్తుతం వెనిజులాలో రోడ్రిగ్జ్‌ పాలన కొనసాగుతోంది. అంతలోనే మరో ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీంతో ఏం జరుగుతుందోనన్న భయం చాలామందిని వెంటాడుతోంది.

ALSO READ:  మంటల్లో ఇరాన్.. రంగంలోకి ట్రంప్, పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

గ్రీన్‌లాండ్‌పై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నేశారు.  దాన్ని అమెరికాలో కలుపుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి పౌరులకు నిధులు ఇవ్వాలని ప్లాన్ చేశారు. అందుకు ఆదేశం అంగీకరించలేదు. రష్యా, చైనాలు గ్రీన్‌లాండ్‌ని సొంతం చేసుకునే అవకాశముందని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఏదో విధంగా గ్రీన్‌‌లాండ్.. అమెరికా సొంతం కాబోతోందని తెలిపారు.

ఇదిలావుండగా ఇరాన్ పై కూడా కన్నేసింది అమెరికా. ఆదేశంలో అల్లర్లకు అక్కడి పాలకులు కారణమని ఆరోపించారు. మరోవైపు క్యూబాకు హెచ్చరికలు చేశారు ట్రంప్. దీనిపై ఆదేశ అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. క్యూబా స్వేచ్ఛాయుతమైన దేశమని, తాము ఏం చేయ్యాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఘర్షణను తాము కోరుకోలేదని, మాతృభూమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×