YS Jagan: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముఖ్యంగా ఆందోళనల కేంద్రమైన జంతర్ మంతర్ ను మూసేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అక్కడికి వెళ్లి జాతీయ పతాకం ఎగురవేసిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు రిమాండ్కు పంపడంపైనా విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ అరెస్టుల్ని విపక్షాలన్నీ ఖండించగా.. ఇప్పుడు ఆ జాబితాలో వైఎస్సార్సీపీ కూడా చేరింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తాజాగా ట్వీట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ల అరెస్టుల్ని ఆయన ఖండించారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే చొరవ చూపి వ్యవహరించడం ఎప్పుడూ మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆయన కేంద్రానికి తెలిపారు.
ఈ వ్యవస్థలో సరిదిద్దాల్సిన లోపం ఒకటి ఉందని జగన్ గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని జగన్ కోరారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టుల వల్ల ఎలాంటి పరిష్కారం లభించదన్నారు. అవి పరిస్థితిని మరింత తీవ్రతరం మాత్రమే చేస్తాయన్నారు. అలాగే తాను సౌరవ్ దాస్, అశుతోష్ రాంంకాల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నాని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read: డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?