E-Paper
Advertisement

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!
Advertisement

UPI Payment: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో యూపీఐ పేమెంట్స్ ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. సెకన్ల వ్యవధిలోని నగదును ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ సౌలభ్యం కొన్నిసార్లు పొరపాట్లకు దారితీసే ఛాన్స్ ఉంది. తప్పుడు యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం లేదా తప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి చిన్న పొరపాట్ల వల్ల డబ్బు వేరే వాళ్ల ఖాతాకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇలా జరిగితే డబ్బును తిరిగి ఎలా పొందాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

యూపీఐ యాప్‌లో ఫిర్యాదు

పొరపాటు జరిగితే ఏ యాప్ ద్వారా పేమెంట్ చేశారో, అదే యాప్‌లో ఫిర్యాదు చేయాలి. ఇందు కోసం యాప్‌లోని ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్లి, తప్పుగా జరిగిన పేమెంట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ‘రైజ్ ఏ కంప్లైంట్’ (Raise a Complaint) లేదా ‘రిపోర్ట్ యాన్ ఇష్యూ’ (Report an issue) అనే ఆప్షన్ క్లిక్ చేసి దాని ద్వారా ఫిర్యాదు చేయెుచ్చు. దీంతో పాటు బ్యాంకును కూడా సంప్రదించి.. విషయాన్ని తెలియజేయాలి. కంప్లైంట్ రిజిస్టర్ చేయమని కోరాలి. యూపీఐ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్, ఇతర వివరాలను వారికి బ్యాంక్ సిబ్బందికి అందించాలి. అప్పుడు యూపీఐతో పాటు సదరు బ్యాంక్ సైతం మీ కంప్లైంట్ ను రిజిస్టర్ చేసుకుంటాయి.

డబ్బు వెంటనే ఎందుకు వెనక్కి రాదు?

Advertisement

ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్‌కు, సక్సెస్ అయిన పేమెంట్‌కు చాలా తేడా ఉంటుంది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయ్యి మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయితే అది సాధారణ రివర్సల్ ప్రక్రియ ద్వారా తిరిగి వస్తుంది. కానీ డబ్బు విజయవంతంగా వేరే వ్యక్తి ఖాతాకు చేరినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరో ఒకరి ఖాతాలోకి వెళ్లిన డబ్బును బ్యాంకులు సులభంగా వెనక్కి తీసుకోలేవు. బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అవతలి వ్యక్తి బ్యాంకుకు (Beneficiary bank) బ్యాంకు ఒక రిక్వెస్ట్ పంపి, డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా గ్రహీతను (Recipient) కోరతారు. కాబట్టి, ఫిర్యాదు చేసినంత మాత్రాన ఖాతాలో ఆటోమేటిక్ గా డబ్బు రిఫండ్ కాదు. అవతలి వారి స్పందనపై మనీ రిటర్న్ ఆధారపడి ఉంటుంది.

Also Read: డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

డబ్బు రాకపోతే ఏం చేయాలి?

Advertisement

డబ్బు పొందిన వ్యక్తి తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తే బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ వారు సహకరించకపోతే మీ కంప్లైంట్ నంబర్, ట్రాన్సాక్షన్ రికార్డులను భద్రంగా ఉంచుకుని మీ బ్యాంకును ఫాలో అప్ చేస్తూ ఉండాలి. బ్యాంకుకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే ఆయా బ్యాంకుల గ్రీవెన్స్ రెడ్రసల్ (Grievance Redressal) ప్రక్రియను ఉపయోగించవచ్చు. నిర్దిష్ట పరిస్థితులలో ఆర్బీఐ (RBI) ఇంటిగ్రేటెడ్ ఓంబ్‌డ్‌మ్యాన్ మెకానిజంను కూడా ఆశ్రయించవచ్చు.

Also Read: తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

Tags

Related News

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?

లింక్డ్‌ఇన్ డేటాతో యువతికి వేధింపులు.. జాబ్ కోసం నంబర్ ఇస్తే.. ఇదా పరిస్థితి?

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

Big Stories

Advertisement
×