E-Paper
Advertisement

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

YS Jagan: విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) కలిసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదు చేశారు. నామినేషన్ దాఖలు చేయకుండా తమ అభ్యర్థులను అధికార పార్టీ నేతలు, పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల వ్యవస్థ , రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సంఘంపై జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

సీఈసీ నియామక ప్రక్రియపై గతంలో తాము తీసుకున్న నిర్ణయం పట్ల జగన్ పశ్చతాప్తం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలో జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని స్వతంత్ర సంస్థలతో పాటు రాష్ట్రంలోనూ ఎస్ఈసీ నియామక విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

నామినేషన్ల అడ్డుగింతపై ఎస్ఈసీకి ఫిర్యాదు

Advertisement

రాష్ట్రంలో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై పోలీసుల వేధింపులు మితి మీరాయని జగన్ మండిపడ్డారు. గురజాలలో చైర్‌పర్సన్ అభ్యర్థులను ఏకంగా పోలీసులే బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఎస్పీ ఎస్కార్ట్ ఇస్తే తప్ప నామినేషన్ వేయలేని దయనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, నామినేషన్ల గడువును పెంచాలని ఎస్ఈసీని కోరినట్లు తెలిపారు. సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో పోలీసు శాఖ పూర్తిగా అధికార పార్టీకి వాచ్‌మెన్‌లా పనిచేస్తోందని జగన్ విమర్శించారు. ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు ఒక మాఫియా మాదిరిగా తయారయ్యారని మండిపడ్డారు. డీఐజీ కోయ ప్రవీణ్ వృత్తి ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయి చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ, కేంద్ర బలగాల రక్షణలో ఉన్న వారిపైనే తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు.

ప్రభుత్వ భయమే ఈ అణచివేతకు కారణం

గతంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తాము సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించి క్లీన్ స్వీప్ చేశామని జగన్ గుర్తుచేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే ప్రస్తుత పాలకులు ఎన్నికలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. పారదర్శకమైన ఎన్నికలు జరగకపోతే ప్రజలే తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.

Also Read: ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

Tags

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

Big Stories

Advertisement
×