Horror Thriller Movie: చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్లిన ఓ యువతికి అక్కడ ఎదురైన నిజం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. తమ్ముడిని ఓ కేసు నుంచి కాపాడేందుకు వెళ్లిన ఆమెకు, చనిపోయిన వాళ్ల మధ్య దాక్కున్న ప్రమాదం గురించి తెలియదు. అక్కడి నుంచి బయట పడాలంటే తన తెలివిని ఉపయోగించడమే కాదు, ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది. ఓ మార్చురీలో జరిగే భయంకరమైన సంఘటనలతో సాగే హారర్ థ్రిల్లర్ ‘ప్లే డెడ్’ (Play Dead). మరి ఈ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే…
క్లోయీ ఆల్బ్రైట్ క్రిమినాలజీ చదువుతున్న యువతి. ఆమె తమ్ముడు టీజే. ఓ నేరానికి సంబంధించిన సమస్యలో చిక్కుకుంటాడు. అతడిని కాపాడేందుకు ఉపయోగపడే కీలకమైన ఆధారం మార్చురీలో ఉందని క్లోయీకి తెలుస్తుంది. దాన్ని సంపాదించాలంటే అక్కడికి వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించదు. అందుకే చనిపోయినట్టు నటించి, తనను కూడా ఓ మృతదేహంలా మార్చురీకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే మార్చురీలోకి చేరుకున్న క్లోయీకి అక్కడి పరిస్థితులు వింతగా అనిపిస్తాయి.
చూస్తే సాధారణంగా కనిపించే ఆ ప్రదేశమే అది. అక్కడ పని చేసే వ్యక్తి మాత్రం దారుణమైన పనులు చేస్తున్నాడని ఆమెకు తెలుస్తుంది. మృతదేహాల వెనుక దాచిన రహస్యం ఆమెను షాక్ కు గురిచేస్తుంది. అయితే ఆ నిజాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉండదు. క్లోయీ ఇంకా బతికే ఉందని మార్చురీకి బాధ్యత వహించే వ్యక్తికి తెలిసిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆధారం కోసం వచ్చిన ఆమె ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో పడుతుంది.
చుట్టూ మృతదేహాలు, బయటపడే దారి కనిపించని గదులు, తనను వెంబడిస్తున్న ప్రమాదకరమైన వ్యక్తి.. వీటి మధ్య క్లోయీ ఎలా తప్పించుకుంటుందనేదే కథలో ఉత్కంఠను పెంచుతుంది. మరి అక్కడి నుంచి హీరోయిన్ ఎలా బయట పడింది ? అసలు ఆ మార్చురీలో జరుగుతున్న జరకూడని పని ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
‘ప్లే డెడ్’ 2022లో విడుదలైన ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్స్టా JioHotstarర్లో అందుబాటులో ఉంది సినిమా. అయితే తెలుగు ఆడియో మాత్రం లేదు. మార్చురీ నేపథ్యంలోని సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. క్లోయీ పాత్రలో బైలీ మాడిసన్ (Bailee Madison) నటించగా, జెర్రీ ఓ’కానెల్ (Jerry O’Connell), ఆంథనీ టర్పెల్ (Anthony Turpel) కీలక పాత్రల్లో కనిపించారు. పాట్రిక్ లూసియర్ (Patrick Lussier) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Also: జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్… నాలుగో సీజన్ రచ్చ రచ్చ