BigTV English

YSRCP : వైఎస్ఆర్ సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం.. ఏపీలో ఘనంగా వేడుకలు..

YSRCP :  వైఎస్ఆర్ సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం.. ఏపీలో ఘనంగా వేడుకలు..

YSRCP : వైఎస్ఆర్ సీపీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


‘‘గత 12 ఏళ్లుగా నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఘనంగా వేడుకలు..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత పాల్గొన్నారు.


12 ఏళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారని సజ్జల తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్‌ అన్నారు. అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారని వివరించారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని చెప్పుకొచ్చారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్‌ పాలన కొనసాగిస్తున్నారని సజ్జల అన్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీని ఓ రోల్‌ మోడల్‌ గా పేర్కొన్నారు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరన్నారు.

FOR MORE UPDATES PLEASE FOLLOW :https://bigtvlive.com/andhra-pradesh

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×