Sobhita: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి(Akkineni Family) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.. ప్రస్తుతం అక్కినేని వారసులుగా ఇండస్ట్రీలో నాగచైతన్యతో పాటు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య (Nagachaitanya) మొదట సినీనటి సమంత(Samantha) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల సమంతతో విభేదాలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు. అనంతరం నాగచైతన్య నటి శోభిత(Sobhita)ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా శోభిత సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో చూస్తుంటే మాత్రం శోభిత ది నైట్ మేనేజర్ సీజన్ 2 విడుదల సమయంలోదని స్పష్టమవుతుంది. ఇలా శోభితకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో బయటకు రావడంతో ఈ వీడియోని ప్రస్తుతం వైరల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యాంకర్ పలువురు హీరోయిన్ల గురించి శోభితను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సమంత గురించి కూడా ప్రశ్న ఎదురవడంతో సమంత గురించి శోభిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సమంత గురించి శోభిత మాట్లాడుతూ సమంత సినీ కెరియర్ చూస్తే సూపర్ కూల్… సమంత నటించిన సినిమాలను చూస్తే ఆ సినిమాలలో ఆమె పాత్ర ప్రధానంగా నిలుస్తోంది.. సినిమాల విషయంలో సమంత చాలా మంచి నిర్ణయాలను తీసుకుంటుంది అంటూ ఈ సందర్భంగా శోభిత సమంత గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసిన శోభిత, సమంత అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సమంత పై ప్రశంసలు కురిపించడంతో శోభిత ఇంత గొప్పగా ఆలోచిస్తారా అట్టు పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంత గురించి శోభిత ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికే చైతన్య శోభిత విడాకులు తీసుకొని విడిపోయారు.
?igsh=MWg2ejQ0eTllNjF4ZA%3D%3D
ఇక సమంత చైతన్య వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడంతో శోభిత నాగచైతన్యకు పరిచయం కావటం ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహం తర్వాత ఇద్దరు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక శోభిత అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్ గా పరిచయమై పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు.ఇక తెలుగులో గూడచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం శోభిత కూడా పలు ప్రాజెక్టులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక చైతన్య విషయానికి వస్తే ఇటీవల తండేల్ సినిమాతో హిట్ కొట్టిన చైతూ ప్రస్తుతం తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: Dil Raju: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. ఇకపై