Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక సూపర్ హిట్ సినిమా కోసం దాదాపు 12 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కొన్ని సినిమాలు వచ్చినా కూడా అవి పూర్తిస్థాయిలో ఆడియన్స్ ని సంతృప్తి పరచలేదు అనేది వాస్తవం. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి (agnyaathavaasi) సినిమా ఆ స్థాయి సక్సెస్ ఇస్తుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది.
అక్కడితో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేసారు. కానీ మళ్ళీ త్రివిక్రమ్ చొరవతో వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజి, దానికంటే ముందు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు (Harihara Veera Mallu) సినిమాలు తప్పితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసినవి రీమేక్ లే. ఓజి సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహానే నింపింది. సెలబ్రిటీలు అంతా కూడా ఆ సినిమా విడుదలైనప్పుడు తమలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానిని కూడా బయటకు తీశారు.
మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) మరియు మెగా ఫ్యామిలీ (mega family) అంతా కూడా ఈ సినిమాను బంజర హిల్స్ లో ఉన్న ప్రసాద్ లాబ్స్ లో చూడనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి చూసేసారు. కానీ మళ్లీ ప్రత్యేకించి బహుశా పవన్ కళ్యాణ్ మదర్ అంజనమ్మ గారి కోసం ప్రసాద్ ల్యాబ్స్ లో చూస్తున్నారు కావచ్చు.
ఓజి సినిమాను ఆడియన్స్ తో పాటు చూసే అవకాశం కూడా ఉంది. సరైన సెక్యూరిటీని తీసుకొని థియేటర్ కు వెళ్లి చూడడం కూడా సాధ్యమే. కానీ ప్రసాద్ ల్యాబ్స్ లో చూడడానికి ఒక కారణం ఉంది. కేవలం అంజనమ్మ గారు మాత్రమే కాకుండా, మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కూడా వస్తారు కాబట్టి అక్కడ చూస్తున్నారు.
ఓజి సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఆ సినిమాను చూడకూడదు. అలానే వాళ్లకు థియేటర్లో ఎంట్రీ ఉండదు. అందు నిమిత్తమే ప్రత్యేకించి ప్రసాద్ ల్యాబ్స్ లో చూస్తున్నారు.
మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 252 కోట్లు ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చినట్లు డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అవి కూడా రికార్డ్స్ లో భాగం అయిపోయాయి.
Also Read: OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్