Nalgonda Crime: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో ఆటో, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం