Tilak-Lokesh: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవడం వెనుక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తిలక్ వర్మపై .. దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా కు మరో యువరాజ్ సింగ్ దొరికాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. అతన్ని వన్డేల్లోకి కూడా తీసుకోవాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ కు… తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు. డియర్ నారా లోకేష్ అన్నయ్య అంటూ రాసి తన క్యాప్… నారా లోకేష్ కు ఇవ్వనున్నారు తిలక్ వర్మ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు తిలక్ వర్మ అదిరిపోయే ప్లాన్ చేశారు. ఈ మేరకు ఓ క్రేజీ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సమయంలో తాను ధరించిన టోపీని మంత్రి నారా లోకేష్ అన్నయ్యకు ఇవ్వబోతున్నట్లు.. తిలక్ పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో… వెంటనే నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. నువ్వు ఇండియా రాగానే నీ చేతుల మీదుగా… ఆ క్యాప్ అందుకుంటా తమ్ముడు అని మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. దీంతో ఇద్దరి పోస్టులు వైరల్ అవుతున్నాయి.
This made my day, tammudu! 😍 Excited to get it straight from you when you’re back in India, champ!#AsiaCup2025 @TilakV9 pic.twitter.com/hsdEljJ2lS
— Lokesh Nara (@naralokesh) September 29, 2025