E-Paper
Advertisement

Evil Eye: నరదిష్టితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ రెమెడీస్ పాటించాలట

Evil Eye: నరదిష్టితో బాధపడుతున్నారా..? ఈ సింపుల్ రెమెడీస్ పాటించాలట
Advertisement

Evil Eye: నరదిష్టితో బాధపడుతున్నారా..? మీ ఇంటిపై నరఘోష ఎక్కువగా ఉందా..? మీకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ రెమెడీస్ తో మీరు నరదిష్టి నుంచి మీ ఇంటిని నరఘోష నుంచి విముక్తి కల్పించుకోమని పండితులు సూచిస్తున్నారు. అయితే ఆ సింపుల్‌ రెమెడీస్‌ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నరదిష్టి, నరఘోష మనుషుల చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తుంటాయని చాలా మంది నమ్ముతుంటారు. ఈ రెండు రకాల దిష్టిదోసాలు మనుషులను అనేక విధాలుగా ప్రభావితం  చేస్తుంటాయట. ఆర్థిక, ఆరోగ్య సమస్యలే కాకుండా.. కుటుంబంలో అశాంతి.. గొడవలకు కూడా ఈ రెండు దిష్టి దోషాలే కారణం అయ్యుండొచ్చు అంటున్నారు పండితులు అయితే చిన్న చిట్కాలతో ఈ రెండు దిష్టి దోషాలను దూరం చేసుకోవచ్చంటున్నారు.

Advertisement

ఉప్పు – మిరపకాయలతో దిష్టి తీయడం: ఎవరైనా తమకు నరదిష్టి తగిలింది అనుకుంటే వెంటనే ఇంట్లో ఉన్న లావు ఉప్పు ( రాక్‌ సాల్ట్‌) తీసుకుని మీ తల చుట్టూ మూడు లేదా ఏడు సార్లు క్లాక్‌ వైజ్ డైరెక్షన్‌లో దిష్టి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మిరపకాయలతో కూడా ఇదే విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఇది నరదిష్టిని తొలగించడానికి సాధారణంగా చేసే పద్ధతట.

నిమ్మకాయలతో  దిష్టి తీయడం: మీకు దిష్టి తగిలింది అనే అనుమానం వస్తే వెంటనే ఒక నిమ్మకాయ తీసుకుని మీ తల చుట్టు ఏడు సార్లు తిప్పి బయట ఎక్కడైనా రోడ్డు మీద వేయాలట. ఇలా చేయడం వల్ల మీకు తగిలిన దిష్టి మాత్రమే కాదు చెడు శక్తులు కూడా దూరమవుతాయట.

Advertisement

నల్ల బొట్టు పెట్టడం: ఎవరైనా చిన్న పిల్లలకు కానీ పెద్ద వాళ్లకు కానీ దిష్టి తగిలిగే చాలా నీరసంగా అయిపోతారట. అలాంటి వాళ్లు నల్లటి బొట్టు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. దీంతో వారికున్న దిష్టి పోతుందట.

ఇక మీ ఇంటికి నరఘోష ఉన్నట్లయితే ఇంట్లో ప్రశాంతత ఉండదట. సంతోషం దూరం అవుతుందట. కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయట. ఇలాంటి వారు కూడా కొన్ని చిన్న రెమెడీస్‌ పాటించొచ్చు అంటున్నారు పండితులు.

ఇంట్లో కర్పూరం వెలిగించడం: ఎవరికైనా తమ ఇంటికి నరఘోష ఉన్నట్టు అనుమానం వస్తే.. వెంటనే ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో దేవుడి దగ్గర కర్పూరం వెలిగించాలట. అలాగే ఇంకో కర్పూరాన్ని వెలిగించి ఇంట్లో మొత్తం ఆ వెలుగు చూపించి బయట పడేయాలట. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ మొత్తం పోతుందట.

ఉప్పు నీటితో ఇల్లు తుడవడం: ఇంటికి నరఘోష ఉన్నప్పుడు ఇంటిని ప్రతిరోజు ఉప్పు నీటితో తుడవాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ పోతుందట.

ఇంట్లో దేవుడిని పూజించాలి: ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో  దేవుడి ముందు దీపం వెలిగించి పూజ లేదా జపం లాంటిది చేసుకోవాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఉగాది రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా చేయాలట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×