E-Paper
Advertisement

అమరావతిపై వైసీపీ ‘సెల్ఫ్ గోల్’.. అసెంబ్లీకి డుమ్మా.. పార్టీకి కోలుకోలేని దెబ్బ!

అమరావతిపై వైసీపీ ‘సెల్ఫ్ గోల్’.. అసెంబ్లీకి డుమ్మా.. పార్టీకి కోలుకోలేని దెబ్బ!
Advertisement

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికారంలో ఉన్నంత కాలం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిన వైసీపీ, అంతకు ముందు తర్వాత అమరావతికి అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇచ్చింది. అయితే సంబంధిత తీర్మానంపై ప్రత్యేకంగా ఏర్పాటైన సమావేశానికి వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడం తీవ్ర విమర్శల పాలవుతుంది. అంటే అమరావతికి చట్టబద్దతపై తమకు చిత్తశుద్ది లేదని చాటుకుని.. ఆ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా?

అమరావతి బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్దత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. తాజాగా రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ముద్ర వేయించుకోవడానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఆమెదించింది. అమరావతి రాజధాని బిల్లు ఢిల్లీకి చేరుకుందని, ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

జగన్ మాటలు మారాయా?

Advertisement

మొదటిసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీ అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించింది. కూటమి హయాంలో రాజధాని పనులు ముందుకు సాగలేదని, తాము అధికారంలోకి రాగానే అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని అప్పట్లో జగన్ పదేపదే ప్రకటంచారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టి మూడుముక్కలాట మొదలుపెట్టారు.

ప్రత్యేక అసెంబ్లీతో కీలక నిర్ణయం

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరవాతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ కల్పించాలని పట్టుదలతో ఉన్నారు. దానిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో.. గతంలో ఉన్న సీఆర్‌డీఏ 2014 చట్టానికి సంబంధించి తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించింది ఆ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత లభించనుంది. అమరావతికి చట్టబద్దత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీలులేకుండా గట్టి పునాది వేయాలని చూస్తున్న చంద్రబాబు, సదరు తీర్మానం చేయడనికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం సూచించిన మార్పులతో తీర్మానం ఆమోదింప చేశారు.

జగన్ టీమ్‌పై విమర్శలు

Advertisement

151 సీట్లతో అధికారంలో కొనసాగి, 11 సీట్లతో పరాజయం పాలైన వైసీపీ,.. ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకని బాయ్ కాట్ చేస్తూ వస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు వైసీపీ సభకు హాజరవుతుందని అందరూ భావించారు. అయితే జగన్ టీమ్ మాత్రం యధావిధిగా అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసింది. గత ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. మరీముఖ్యంగా రాజధాని అమరావతి విస్తరించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కక, ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది.

అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గత ఏడాది కాలంగా వైసీపీ నేతలు మాత్రం అమరావతి విషయంలో ఉగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముంపు ప్రాంతమని ఒకసారి, అసలు అమరావతికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఒకసారి విమర్శిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం రాజధాని విషయంపై పునరాలోచన చేస్తామని ఒక సందర్భంలో ప్రకటించారు.

జగన్ వ్యాఖ్యలు గందరగోళం

అయితే జగన్ మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన చేయలేదు. పైపెచ్చు విజయవాడ – గుంటూరు మధ్యలో నాగార్జున యునివర్సిటీ వద్ద రాజధాని భవనాలకి 30 ఎకరాలు సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత జాతీయ మీడియాతో ఇంగ్లీషులో మాట్లాడుతూ రివర్ బేసిన్, అదీఇదీ అంటూ అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధానని విచిత్రమైన నిర్వచనం చెప్పారు. సజ్జల మాత్రం జగన్ అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించలేదని పదేపదే చెప్తూనే ఉన్నారు.

వైసీపీకి సెల్ఫ్ గోల్?

ఇలాంటి పరిస్ధితుల్లో అమరావతికి చట్టబద్దత కోసం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. దాంతో అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదనీ,రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదని స్పష్టంగా తేలిపోయిందంటున్నారు. ఆ క్రమంలో రాజధానిపై వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందని, రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా కోలుకోలేని నష్టం జరగడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు.

రాజధాని అంశంలో జగన్ వైఖరి మళ్లీ హాట్ టాపిక్

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమారవతి అంధ్రప్రదేశ్ రాజధానని స్పష్టంగా చెప్పారు. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతికి సంపూర్ణ మద్దతు పలికి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ అమరావతిలో జరుగుతున్న పనులు కూడా నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని అడవిలా మార్చారు. తాజాగా అసెంబ్లీ సమావేశానికి డుమ్మా కొట్టి.. రాజధానిపై తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:వామ్మో.. నెలరోజుల యుద్ధం ఖర్చు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×