E-Paper
Advertisement

Manchu Manoj: కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్

Manchu Manoj: కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
Advertisement

Manchu Manoj: తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు (Amarajeevi Potti Sriramulu) 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘Statue of Sacrifice’ పేరుతో అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక‌ను సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆవిష్కరించారు. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (Statue of Sacrifice) నిర్మాణాన్ని కేవలం 6 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం విశేషం. స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ప్రారంభోత్సవం సందర్భంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Vijay: పాపం విజయ్, త్రిష.. పోలింగ్ తేదీ, కౌంటింగ్ తేదీలతో కూడా ట్రోలింగ్!

చరిత్ర గర్విస్తున్న మహనీయుడు

Advertisement

‘‘చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు, అధికారమూ లేదు. అతని దగ్గర ఉన్నది ఒక్కటే.. అచంచల సంకల్పం. అహింసను ఆయుధంగా, నిరాహారాన్ని ప్రతిఘటనగా మార్చిన యోధుడు. 58 రోజుల దీక్ష.. ఒక శరీరాన్ని బలహీనపరిచింది, కానీ తెలుగు జాతి స్వాభిమానాన్ని మేల్కొలిపింది. ఆ త్యాగం తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆ ఉద్యమం దేశమంతా వ్యాపించి 1956లో భారతదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా నూతన పటాన్ని పొందింది. తెలుగు నాట హరిజనులను ఆలయ ప్రవేశం చేయించిన సంఘసంస్కర్త. భారతదేశంలో భాషా రాష్ట్రాల నిర్మాతగా చరిత్ర గర్విస్తున్న మహనీయుడు. 58 అడుగుల విగ్రహం కేవలం ఒక కొలత కాదు.. 58 రోజుల సంకల్పానికి నిలిచిన సజీవ రూపం. కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. ఒక మనిషి ఉపవాస దీక్ష కూడా! అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కోటి నమస్కారాలు’’ అంటూ మంచు మనోజ్ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ఆయనకు నివాళులు అర్పించారు.

Also Read- Sreeleela: శ్రీలీలా.. జబర్దస్త్ మహేష్‌ను ఎందుకలా చూసింది? అక్కడ అసలు ఏం జరిగిందంటే?

58 రోజుల పాటు కఠిన దీక్ష

Advertisement

పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గుండెల్లో అమరజీవిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమనే విషయం తెలియంది కాదు. నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠిన దీక్ష చేసి, 1952, డిసెంబర్ 15న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత జరిగిన ప్రజాందోళనల వల్ల అప్పటి ప్రభుత్వం దిగివచ్చి, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తర్వాతి కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది. ఇప్పటి తరాలకే కాకుండా, రాబోయే తరాలకు కూడా ఆయన త్యాగం తెలియాలని, ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమని.. నెటిజన్లు కొనియాడుతున్నారు.

Also Read- Vishwanth And Sons Teaser: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్…కథ మొత్తం లీక్ చేశారుగా?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×