E-Paper
Advertisement

LUCKY CLOTHES: మీరు వేసుకునే బట్టలే మీకు ధనయోగం ఇస్తాయట – ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలో తెలుసా..?

LUCKY CLOTHES: మీరు వేసుకునే బట్టలే మీకు ధనయోగం ఇస్తాయట – ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలో తెలుసా..?
Advertisement

LUCKY CLOTHES: మీరు వేసుకునే బట్టలే మీకు ధనయోగాన్ని తీసుకొస్తాయట. అయితే  బట్టలే కాదు రంగులు కూడా ముఖ్యమేనట. ఏ రంగుల బట్టలు ఏరోజు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ పరిహార శాస్త్రం ప్రకారం వ్యక్తులు వేసుకునే రంగుల బట్టలు కూడా వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయట. అయితే ఏరోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలనేది కూడా పరిహారశాస్త్రంలో ఉందంట. ఆ శాస్త్రంలో ఉన్న కలర్ క్లాత్స్ వేసుకుంటే లక్కు మీకు పడుతుందని చెప్తున్నారు పండితులు.

Advertisement

ఆదివారం: ఆదివారం సూర్యుడి ఇష్టమైన వారం. ఈ రోజు ఎరుపు రంగు, ఆరెంజ్‌ కలర్‌, గోల్డెన్‌ కలర్‌ బట్టలు ధరిస్తే.. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. సంఘంలో గౌరవం పెరుగుతుందట. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయట.

సోమవారం: సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు. సోమవారం నాడు తెలుపు రంగు, క్రీమ్‌ కలర్‌, లైట్‌ బ్లూ రంగు బట్టలు ధరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ కలర్‌ బట్టలు ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందట. మనసులోని భావోద్వేగాలు సమతుల్యంగా ఉంటాయట.

Advertisement

మంగళవారం: మంగళవారం కుజుడికి(మంగళ గ్రహం) ఇష్టమైన వారం. ప్రతి మంగళవారం ఎరుపు రంగు మెరూన్‌ కలర్ బట్టలు వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రెండు రంగుల బట్టలు వేసుకోవడం వల్ల మీలోని ధైర్యం  పెరుగుతుందట.. శక్తి పెరుగుతుందట. అలాగే శత్రు భయం తగ్గుతుందట.

బుధవారం: బుధవారానికి అధిపతి బుధుడు. జన్మకుండలిలో బుధుడు పాజిటివ్‌ గా ఉంటే వారికి విద్యకు సంబంధించిన డెవలప్‌మెంట్‌ ఉంటుందట. బుధవారం రోజున ముఖ్యంగా ఆకుపచ్చ (Light Green/Green) రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల ప్రశాంతత, అదృష్టం, మరియు వ్యాపార వృద్ధి కలుగుతుందట. అలాగే ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు, నైపుణ్యం పెరుగుతాయని సూచిస్తున్నారు.

గురువారం: గురువారానికి అధిపతి గురుడు( బృహస్పతి) అందుకే ప్రతి గురువారం పసుపు కలర్‌, క్రీమ్, గోల్డ్‌ షేడ్‌ కలర్‌ బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కలర్‌ బట్టలు వేసుకుంటే.. అదృష్టం కలిసి వస్తుందట. ధనాభివృద్ది కలుగుతుందట. జ్ఞానం పెరుగుతుందట.

శుక్రవారం: శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఇష్టమైన పింక్‌, వైట్‌, లైట్‌ పర్పుల్‌ కలర్‌ బట్టలు వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీని వల్ల అందం పెరుగుతుందట. అలాగే ప్రేమ, వైవాహిక సుఖం లభిస్తుందట.

శనివారం: శనివారానికి అధిపతి శనిదేవుడు. కాబట్టి ప్రతి శనివారం నలుపు, ముదురు నీలం రంగు బట్టలు వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుందట. చేస్తున్న పనిలో ఏకాగ్రత పెరుగుతుందట. అకస్మిక అదృష్టం వరిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇంటికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ చిన్న రెమెడీస్ పాటించాలట

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×