E-Paper
Advertisement

Ugadi Lakshmi Pooja: ఉగాది రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా చేయాలట

Ugadi Lakshmi Pooja: ఉగాది రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా చేయాలట
Advertisement

Ugadi Lakshmi Pooja: ఉగాది (Ugadi) రోజు లక్ష్మీదేవి (Lakshmi) కటాక్షం పొందడానికి ఒక చిన్న పూజ చేయడం చాలా శుభంగా భావిస్తారు. అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటిని శుభ్రం చేయాలి: ఉగాది రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా కడుక్కుని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుని అమ్మ వారికి చేయబోయే పూజ కోసం అన్ని వస్తువులు సిద్దం చేసుకోవాలట. ఇవన్నీ కూడా పవిత్రమైన హృదయంతో చేయాలి. అమ్మవారిని ధ్యానించుకుంటూ చేసుకోవాలట. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. వీలైతే పూజ పూర్తి అయ్యే వరకు మౌనం పాటించడం మరింత ఉత్తమం అంటున్నారు పండితులు.

Advertisement

పూజా స్థలం సిద్ధం చేయాలి: ఇంట్లో అమ్మవారికి పూజ చేసే చోటును పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పీట సిద్దం చేసుకుని అలంకరించుకోవాలి. పీటను అలంకరించిన తర్వాత లక్ష్మీ దేవి ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవాలట. తర్వాత అమ్మ వారి ముందు నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలట.

నైవేద్యం పెట్టాలి: అమ్మవారికి నైవేద్యం రెడీ చేసుకోవాలి. లక్ష్మీదేవికి నైవేద్యంగా ఉగాది పచ్చడి (Ugadi Pachadi) కూడా పెట్టొచ్చని పండితులు సూచిస్తున్నారు. అదే కాకుండా పండ్లు, కొబ్బరికాయను కూడా నేవేద్యంగా సమర్పించాలట.

Advertisement

మంత్ర జపం చేయాలి: ఎవరైనా గురువుల దగ్గర స్వీకరించిన లక్ష్మీదేవి మంత్రం ఉంటే అదే మంత్రాన్ని అమ్మవారి ముందు కూర్చుని సంకల్పం చెప్పుకుని జపం చేసుకోవాలట. లేదంటే గురువుల దగ్గర మంత్రం స్వీకరించకపోతే “ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని కళ్లు మూసుకుని 11 సార్లు జపించాలట. జప సంఖ్య అనేది మీ ఓపికను బట్టి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 21 కానీ 108 కానీ 1008 కానీ ఇలా మీ ఒపిక ఉన్నంత వరకు ఎంతైనా జపం చేసుకోవచ్చట.

అక్షింతలు, హారతి: అమ్మవారి ముందు మీ జపం పూర్తి అయ్యాక మీరు రెడీ చేసుకున్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి.. తర్వాత హారతి ఇవ్వాలట. హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకుని అమ్మవారికి సమర్పించి మీ కోరిక మనసులో చెప్పుకోవాలట. దీంతో మీ ఉగాది పండగ రోజు సంకల్పించిన లక్ష్మీదేవి పూజ పూర్తి అయిపోతుందట. పూజ పూర్తి అవ్వగానే.. అమ్మ వారికి సమర్పించిన నైవేద్యాన్ని అందరికి పంచాలట. ఇంట్లో వాళ్లే కాకుండా బయటి వాళ్లకు కూడా ప్రసాద వితరణ చేయడం మంచిదట. అదీ కాకుండా 11 మందికి అన్నదానం చేస్తే ఇంకా శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు.

పూజ చేసిన ఉగాది పండుగ రోజు కచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలట. ఇలా చేయడం వల్ల మీపైన ఆ లక్ష్మీదేవి కృప ఎల్లవేళలా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఉగాది పండుగ రోజు వేపపూలు తినడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్ముతారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఎవరైనా ఆ వస్తువులు ఉచితంగా ఇచ్చినా అస్సలు తీసుకోకూడదట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×