Student Suicide: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్ష సరిగ్గా రాయలేదన్న చిన్న ఆందోళన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పల్నాడు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన మండల రాకేశ్ (15), వట్టిచెరుకూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షను తాను అనుకున్న విధంగా రాయలేకపోయానని రాకేశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
వార్డెన్, వాచ్‌మెన్ అతనికి ధైర్యం చెప్పినప్పటికీ.. రాకేశ్ మనసులో భయం పోలేద. మంగళవారం తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుండి బయటకు వెళ్లిన అతను బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
తమ బిడ్డ ప్రయోజకుడవుతాడని ఆశపడిన ఆ తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు. ‘ఒక్క పరీక్ష తప్పితే జీవితమే పోతుందా నాయనా.. నువ్వు ఉంటే చాలు అనుకున్నాం కదా’ అంటూ వారు రోదించిన తీరు అక్కడి ఉన్న ప్రతీ ఒక్కరినీ కదిలించివేసింది. విద్యార్ధులు పరీక్షల ఒత్తిడిని జయించాలని, చిన్నపాటి వైఫల్యాలకు ప్రాణాలు తీసుకోవద్దని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:20 రోజుల క్రితమే వివాహం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య