E-Paper
Advertisement

scientific secrets: మొలతాడు కట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్ రహస్యాలు ఏంటో తెలుసా..?

scientific secrets: మొలతాడు కట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్ రహస్యాలు ఏంటో తెలుసా..?
Advertisement

scientific secrets: మొలతాడు కట్టుకోవడంలో కూడా అధునికి సాంకేతిక సైన్స్‌ రహస్యాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. మొలతాడు కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఆనాటి పెద్దలు చెప్పిందే.. ఇప్పటి సైన్స్‌ ధృవీకరిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే మొలతాడు కట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్‌ రహస్యాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ హిందూ సంప్రదాయంలో మొలతాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మగపిల్లాడు పుట్టిన దగ్గర నుంచే మొలతాడు కట్టడం ప్రారంభిస్తారు. అయితే మొలతాడు కట్టుకోవడం అనేది ఏదో ష్యాషన్ అనుకుంటే తప్పు.. అంటున్నారు పండితులు. మొలతాడు కట్టుకోవడంలో ఎంతో శాస్త్ర సాంకేతికత దాగి ఉందని చెప్తున్నారు. మొలతాడు అనేది ఒక వ్యక్తి భాడీకి ఎన్ని విధాల ఉపయోగపడాలో అన్ని విధాల ఉపయోగపడుతుందని.. ఎన్నో సమస్యలకు మొలతాడుతోనే పరిష్కారం దొరుకుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. మొలతాడు అనేది కట్టుకోవడం వల్ల ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య కారణాలకు మూలమవుతుందని చెప్తున్నారు.

అవయవాల పెరుగుదల:

Advertisement

పిల్లలు పుట్టగానే… మొలతాడు కట్టడం అనేది హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా మొలతాడు కట్టడం వెనకు శాస్త్రీయ ధృక్కోణం ఉందని పండితులు చెప్తున్నారు. మొలతాడు కట్టడం వల్ల పుట్టిన పిల్లల్లో అవయవాల పెరుగుదల సక్రమంగా ఉంటుందని చెప్తున్నారు.

హెర్నియాకు పరిష్కారం:

మొలతాడు కట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హిందూ పండితులు సూచిస్తున్నారు. అందులో ఒకటి హెర్నియా పరిష్కారం. మొలతాడు కట్టుకోవడం హెర్నియా సమస్యలను రాకుండా అడ్డుకుంటుందట. మొలతాడు అనేది హెర్నియాకు చెక్‌ పెడుతుందట.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

Advertisement

ఎవరైతే నడుము చుట్టు మొలతాడు కట్టుకుంటారో ఆ వ్యక్తులకు మిగతా వారితో పోల్చితే జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయి. మొలతాడు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే మనిషి నరాలపై పడే ఒత్తిడిని బ్యాలెన్స్‌ చేస్తుందట.

శక్తిని కాపాడటం:

మొలతాడు కట్టుకోవడం వల్ల శరీరంలోని శక్తిని వృథా కాకుండా కాపాడుతుందని.. మొలతాడు చేసే వైబ్రేన్స్‌ మొత్తం బాడీని కూడా బ్యాలెన్స్‌ మోడ్‌ లోకి తీసుకొస్తుందని చెప్తున్నారు.

వివిధ రంగులు వివిధ సమస్యల పరిష్కారం:

చాలా మంది మొలతాడును ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న త్రెడ్‌ తీసుకునిక కట్టకుంటారు. అయితే ఇందులో ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటే.. అది జనాకర్షణ కు బాగా ఉపయోగపడుతుందట. ఇక నలుపు రంగొ మొలతాడు కట్టుకుంటే.. దిష్టి దోషాలు తగులవట. అప్పటికే ఉన్న నరఘోషను నల్లదారం మెల్లమెల్లగా తీసి వేస్తుందట.

ఊబకాయ నియంత్రణ:

మొలతాడు నడుముచుట్టు ఉండటం వల్ల ఊబకాయానికి చెక్‌ పెడుతుందని అధునిక శాస్త్ర వేత్తలు చెప్తున్నారు. మొలతాడు వల్ల కడుపు ఎక్కువగా పెరగకుండా (Potbelly) ఉంటుందట. ఇది పొట్ట కండరాలను బిగుతుగా ఉంచి, కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: రాజయోగం పట్టాలంటే ఈ చిన్న రెమెడీ పాటించాలట – ఇంకా పరిహారశాస్త్రం లో ఏముందంటే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×