E-Paper
Advertisement

Gas Shortage: గ్యాస్ కొరతపై యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన

Gas Shortage: గ్యాస్ కొరతపై యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన
Advertisement

Gas Shortage:  దేశంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై భువనగిరి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ సిలిండర్లు, కట్టెలతో వంట కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సహ ఇంచార్జ్ కుమారి భవ్య జి (కర్ణాటక) పాల్గొని మాట్లాడుతూ దేశంలో గ్యాస్ కొరత మోడీ చేతకానితనానికి నిదర్శమని అన్నారు.అబద్దాలు అసత్య ప్రచారాలతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం నడుస్తుందని దేశ ప్రజలంతా మోడీ ప్రజావ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని త్వరలోనే మోడీ పాలనకు చరమగీతం పాడుతారని అన్నారు.

Also Read: SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ

యువజన కాంగ్రెస్ సమిష్టిగా పని చేయాలి 

Advertisement

జిల్లాలో యువజన కాంగ్రెస్ ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరో 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని అన్నారు. రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ గెలుపుకు యువజన కాంగ్రెస్ సమిష్టిగా పని చేయాలని ప్రభుత్వ నామినేటెడ్ స్థానిక సంస్థలు సాధారణ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. యువతలోకి యువజన కాంగ్రెస్ ఆవశ్యకతను వివరించి యోజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక యువజన వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ హరి ప్రసాద్ నాయక్, సహ ఇన్చార్జులు అరవింద్ ,కైసర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సురేష్, పుట్ట గిరీష్ కుమార్ గౌడ్, రాష్ట్ర లీగల్ సేల్ చైర్మన్ గూడూరు నిఖిల్ రెడ్డి, అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని వరుణ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏడు మేకల మహేష్ యాదవ్, దయ్యాల శ్రీశైలం,రేగు రమేష్,అసెంబ్లీ ఉపాధ్యక్షులు చేగురి బాలక్రిష్ణ, మంద గణేష్, మండల అధ్యక్షులు వలిగొండ, భువనగిరి,తూర్కపల్లి, పోచంపల్లి,ప్రవీణ్, కనుకుంట్ల కొండలు, సురేష్, సందీప్, రమేష్,శివ మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Allu Arjun: వాల్ ఆఫ్ గ్రేట్స్ లో కనిపించని టాలీవుడ్ దిగ్గజ దర్శకులు.. అల్లు అర్జున్  పై విమర్శలు?

Related News

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×