Numerology: న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం, ప్రతి పుట్టిన తేదీకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందట. అయితే నాయకత్వ లక్షణాలు, మానసిక ధైర్యం మరియు శారీరక దృఢత్వం విషయానికి వస్తే కొన్ని తేదీలలో పుట్టిన వారు సహజంగానే చాలా “స్ట్రాంగ్” గా ఉంటారట. ఆలాంటి వారు ఏ తేదీలలో పుడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
1వ సంఖ్య జాతకులు: ఏ నెలలో అయిన 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు (సంఖ్య 1 – సూర్యుడు) సూర్య జాతకులు అవుతారట. వీరు పుట్టుకతోనే నాయకులట. వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువట. ఎంతటి కష్టాన్నైనా ఒంటరిగా ఎదుర్కోగలరట. వీరు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరట సొంతంగా ఎదగాలనే పట్టుదల వీరిని మానసిక దృఢత్వంలో అగ్రస్థానంలో నిలబెడుతుందట.
9వ సంఖ్య జాతకులు: ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీలలో పుట్టిన వారు (సంఖ్య 9 – కుజుడు/Mars) 9వ సంఖ్య జాతకులు అవుతారట. న్యూమరాలజీలో 9వ సంఖ్యను అత్యంత శక్తివంతమైన సంఖ్యగా భావిస్తారట. వీరు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారట. సాహసాలు చేయడానికి వెనుకాడరట. శారీరక శక్తితో పాటు, పోరాట పటిమ వీరికి ఎక్కువట. ఏదైనా సాధించే వరకు నిద్రపోరట. వీరు ఎదురుదెబ్బలు తగిలినా చాలా వేగంగా కోలుకుంటారట.
8వ సంఖ్య జాతకులు: ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు (సంఖ్య 8 – శని) ఈ 8వ సంఖ్య జాతకులట. ఈ తేదీలలో పుట్టిన వారి జీవితం పోరాటాలతో కూడి ఉన్నా, వారు చాలా ధృడంగా తయారవుతారట. వీరు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారట. ఎంతో సహనం, పట్టుదల వీరి సొంతమట. ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగల సామర్థ్యం వీరికి ఉంటుందట. వీరు “ఐరన్ విల్” (ఇనుప సంకల్పం) కలిగిన వ్యక్తులట.
5వ సంఖ్య జాతకులు: ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీలలో పుట్టిన వారు (సంఖ్య 5 – బుధుడు) ఈ 5వ సంఖ్య జాతకులట. వీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ మరియు చురుకైన వారట. ఎలాంటి పరిస్థితులకైనా చాలా వేగంగా అలవాటు పడిపోతారట. వీరి తెలివితేటలే వీరికి బలమట. క్లిష్ట సమయాల్లో కూడా కంగారు పడకుండా తెలివితో సమస్యల నుండి బయటపడతారట.
18, 28 ప్రత్యేకత: 28వ తేదీ ఇది 1వ సంఖ్య కిందకు వచ్చినప్పటికీ, ఇందులో 2 అంటే చంద్రుడు, 8 అంటే శని శక్తులు కలిసి ఉండి చివరకు 1 అంటే సూర్యుడు అవుతుంది. కాబట్టి వీరు అటు ఎమోషనల్ గా, ఇటు ప్రాక్టికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారట. ఇక 18వ తేదీలో కూడా 1 అంటే అధికారం, 8 అంటే కష్టం కలిసి 9 అంటే విజయం అవుతుందట. వీరు జీవితంలో ఎన్నో కష్టాలను చూసి రాటుదేలిన వ్యక్తులుగా ఉంటారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.