E-Paper
Advertisement

టాటా పంచ్‌కు షాక్.. జస్ట్ రూ. 7 లక్షలకే మారుతి కొత్త SUV!

టాటా పంచ్‌కు షాక్.. జస్ట్ రూ. 7 లక్షలకే మారుతి కొత్త SUV!
Advertisement

Maruti’s Affordable SUV Plans: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ లో త్వరలో ఆసక్తికరమైన  పరిణామం చోటు చేసుకోబోతోంది. చాలా కాలంగా ఎంట్రీ లెవల్ SUV విభాగంలో మంచి అమ్మకాలు సాధిస్తున్న టాటా పంచ్‌ కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఇందుకోసం మారుతి సుజుకి కొత్త మైక్రో SUVను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త మోడల్‌ ను Y43 అనే కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు.

గత కొంతకాలంగా సత్తా చాటుతున్న టాటా పంచ్

గత కొన్నేళ్లుగా దేశీ మార్కెట్ లో టాటా పంచ్ సత్తా చాటుతోంది. తక్కువ ధర, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, SUV లాంటి లుక్ తో  గ్రామీణ, పట్టణాల కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారింది. ఈ సెగ్మెంట్‌ లో పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన మారుతి కూడా ఇప్పుడు అదే తరహా వెహికల్ తో మార్కెట్‌లోకి రావాలని నిర్ణయించింది.

మైక్రో SUV లాంటి Y43 మోడల్

Advertisement

కొత్తగా రాబోయే Y43 మోడల్ సాధారణ హ్యాచ్‌ బ్యాక్ లాగా కాకుండా పూర్తి స్థాయి మైక్రో SUVలా ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాక్సీ డిజైన్, ఎత్తైన స్టాన్స్, బలమైన రోడ్ ప్రెజెన్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇది సిటీ రోడ్లతో పాటు గ్రామీణ రోడ్లకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. ఈ వెహికల్ HEARTECT ప్లాట్‌ ఫామ్‌ పై నిర్మించబడే అవకాశముంది. ఇదే ప్లాట్‌ ఫామ్‌ పై స్విఫ్ట్, బాలెనో, డిజైర్ లాంటి కార్లు ఇప్పటికే తయారై, మంచి సక్సెస్ అందుకున్నాయి. తేలికగా ఉండే ఈ నిర్మాణం వాహనానికి మంచి మైలేజ్, స్థిరత్వాన్ని అందిస్తుంది.

ఆకట్టుకునేలా ఆధునిక ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త Y43లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది. అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన క్యాబిన్ కూడా ఉండొచ్చు.

ఇంజిన్ గురించి..

Advertisement

ఈ SUVలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తే ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే, మరింత పవర్ కోరుకునే వారికి 1.0 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఇవ్వవచ్చు. అదనంగా, CNG వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండవచ్చు. ఇది సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.

ధర ఎంత ఉంటుందంటే?

ధర విషయానికి వస్తే, ఈ కొత్త SUV సుమారు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ కంటే కొంచెం తక్కువ ధరలో ఇవ్వాలని మారుతి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఈ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరగనుంది. Y43 మోడల్‌ తో మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ SUV విభాగంలో తన స్థానం బలోపేతం చేసుకోవాలనుకుంటుంది.

Read Also: ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×