Financial Tips: భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవేనట. ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుందట. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందట.
ఆ సమయంలో బట్టలు ఉతకకూడదు: భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన అర గంట వరకు భార్య బట్టలు ఉతకకూడదట. అంటే మీ భర్త ఇంట్లో నుంచి ఆఫీసుకు కావచ్చు.. లేదా వ్యాపార స్థలానికి కావచ్చు వెళ్లిన తర్వాత అరగంట వరకు బట్టలు ఉతకకూడదట. అలాగే ఇల్లు కూడా క్లీన్ చేయకూడదు. అలాగే చెత్తను బయట వేయకూడదట. అలా కాదని ఇల్లు తుడవడం.. కడగడం లాంటివి చేస్తే భర్త సంపాదన పెరగడం మాట అటుంచితే తరిగిపోవడం కాయం అంటున్నారు పండితులు.
పసుపు రాసుకోవడం: భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు తన ముఖానికి పసుపు రాసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే కాళ్లకు కూడా పసుపు రాసుకోవాలట. ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే కనీసం శుక్రవారం రోజైనా రాసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. అయితే పసుపు రాసుకోవడంలో శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉందంటున్నారు.
పాపిట్లో కుంకుమ ధరించాలి: ఇక భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ముఖ్యంగా తమ పాపిట్లో కుంకుమ ధరించాలట. చాలా మంది నుదురు మీద బొట్టు పెట్టుకుని పాపిట్లో పెట్టుకోరు. అలా చేయడం తప్పు పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ ధరించాలని సూచిస్తున్నారు.
గాజులు ధరించాలి: పెళ్లైన ప్రతి స్త్రీ తన భర్త సంపాదన పెరగడం కోసం తప్పకుండా మట్టి గాజులు ధరించాలట. అలాగే తలలో పూలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మెడలో ఎప్పుడూ మంగళసూత్రం వేసుకోవాలట. ఇంకా కాలికి మెట్టెలు ధరించాలట.
సంధ్యా కాలంలో నిద్రించకూడదు: ఇంటి మేలు కోరుకునే స్త్రీలు సంధ్యా కాలంలో ఇంట్లో నిద్రించకూడదట. (ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉండే సమయాన్ని సంధ్యా కాలం అంటారు.)
ఇంకా ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకుల అన్నానికి ఒక చుక్క నెయ్యి కలిపి ఆగ్నికి సమర్పించాలట. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుందట.
అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో భర్త క్షవరం చేయించుకోవడానికి వెళ్తుంటే భార్య ఆపాలట. ఆ రోజుల్లో క్షవరం చేయించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలేసి వెళ్లిపోతుందట.
ఇక భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలు మళ్లీ ధరించకూడదట. అలా చేయడం వల్ల మీ భర్తకు నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి సంపాదన తగ్గిపోతుందట. ఇక ఎన్ని పనులున్నా ప్రతి శుక్రవారం ఉదయం, సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించాలట. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.