BigTV English

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Hinduism – Science: సైన్స్‌ నుంచి హిందుత్వం పుట్టిందా..?  హిందుత్వం నుంచి సైన్స్‌ పుట్టిందా..? అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న.  ఇంకొంత మందైతే అసలు హిందుత్వమే లేదని వాదిస్తుంటారు.  సైన్స్‌ అనేది గొప్ప శాస్త్రమని నమ్ముతుంటారు. అయితే సైన్స్‌ గొప్పదా..? హిదుత్వం గొప్పదా  ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


అధునిక కాలంలో సైన్స్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కారు. మనిషి జీవితంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది సైన్స్‌. అలాంటి సైన్స్‌ కు ప్రపంచంలో ఏదీ సాటి రాదని నమ్ముతుంటారు. అయితే కొంత మంది హిందుత్వంలోంచే సైన్స్‌ పుట్టిందని చెప్తుంటారు. అధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్న వాటి కంటే ముందే సనాతన ధర్మంలో పాటించేవారని విద్య, వైద్యం నుంచి అబ్బురపరిచే విషయాలెన్నో హిందుత్వంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని చెప్తుంటారు. ఇప్పడున్న విజ్ఞానాన్ని బేరీజు వేసుకుని సనాతన ధర్మంలో ఉన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టెస్ట్‌ ట్యూబ్ బేబీ: ఈ పరిజ్ఞానం ఒక అద్బుతమని అధునిక వాదులు వాదిస్తుంటారు. అయితే సనాతన ధర్మంలో ఈ టెస్ట్‌ టూబ్‌ బేబీ అనేది ఎప్పుడో చేసేవారు. ద్వాపరయుగంలో భీష్ముడు నీటి నుంచి పుట్టారు. 100 మంది కౌరవులు మట్టి కుండలో పుట్టారు. ( ఇప్పటి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ లాగే) అలాగే పాండవులు పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం నుంచి పుట్టారు. అలాగే ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి ఇంకా కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే..


కర్ణుడి పుట్టకు కూడా ఇలాగే జరిగింది. ఒక సాధారణ మహిళ కుంతి.. సూర్యునిలోని తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మ ఇవ్వడం కూడా అద్బుతమే.. ఇప్పుడున్న ఏ టెక్నాలజీ వారికి సాటి వస్తుంది. అలాగే ఒక సాధారణ పురుషుడు ( భీముడు) ఒక అసాధారణ మహిళకు ( హిడింబి)  వివాహం చేస్తే వారి నుంచి అత్యంత బలవంతుడైన ఘటోత్కచుడు జన్మించాడు. ఇప్పుడున్న ఒక అణు బాంబు వేసినా ఘటోత్కచుడు వెంట్రక కూడా కాలిపోదట.. అంతటి బలవంతుడైన వ్యక్తకి బీజం వేయడం ఇప్పుడున్న ఏ సైన్స్‌కు సాధ్యమవుతుంది.

జెండర్ ట్రాన్స్ఫర్మేషన్: ఆడవారిని మగవారిగా.. మగవారిని ఆడవారిగా మార్చడం ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం. ఇలాంటి  విషయాలు ఎక్కడైనా పేపర్లో చదివితే ఆశ్చర్యపోతుంటాం. అయితే ఈ టెక్నాలజీ హైందవ సంప్రదాయంలో యుగాల కిందటే ఉందంటే నమ్ముతారా..? కానీ నమ్మాల్సిందే..? భారతంలో శిఖండి మొదట స్త్రీగా ఉండి తర్వాత మగవాడిగా మారిపోతాడు. అలాగే మగవాడిగా ఉండి స్త్రీ గా మారిపోయిన చిత్రరథుడు. చేప కడుపులో ఆడపిల్లను పుట్టించడం ( సత్యవతి)

ఇంకా ఇలా చెప్పుకుంటే ఎన్నో మరెన్నో అద్బుతాలు హైందవంలో కనిపిస్తుటాయి. భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మన ఆర్యబట్ట. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మన భాస్కరాచార్య. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మన సుశ్రుతుడు. విద్యుత్ మొట్ట మొదట కనిపెట్టింది మన అగస్త్య ముని. విమాన శాస్త్రాన్ని అందించింది మన భరద్వాజ మహర్షి. ( ఎన్నో పురాణాల్లో పుష్పక విమానం గురించి మనం చదివే ఉంటాం.) భూకంపాలను ముందుగా ఊహించే టెక్నాలజీని కనిపెట్టింది మన వరాహమిహిరుడు. గణితం, భౌతికం, ఖనిజ శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్షణం రాసింది మన వాల్మీకి మహర్షి. రసాయన శాస్త్రం అందించింది మన  నాగార్జునుడు. కాస్మోలజీ చెప్పిన కపిలుడు. అణువుల గురించి వివరించిన కణాదుడు. DNA గురించి చెప్పింది  బోధిధర్మ. మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి. మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసింది ఉత్సమధుడు. మొదటగా సంగీతాన్ని ప్రపంచానికి అందించింది స్వాతి ముని.

ఇవన్నీ నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు.. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ రుషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు? సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయి అని.. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు.. ప్రపంచం కళ్లు తెరవకముందే మన రుషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఉత్తమ భార్యలు అవుతారట

 

Related News

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Big Stories

×