OTT Movie : ఆహ్లాదకరమైన సముద్ర ప్రయాణం చేయాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో సముద్రపు జర్నీ ని చూస్తే జన్మలో ఇలాంటి సాహసం చేయరు. ఈ కంటెంట్ అంత ఘోరంగా ఉంటుంది. ఈ సినిమా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, సిట్జెస్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్లోరెన్స్ కొరియా ఫిల్మ్ ఫెస్ట్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. అయితే ఈ చిత్రం తీవ్రమైన హింస, లైం*గిక కంటెంట్ కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
స్టోరీలోకి వెళ్తే
ఈ చిత్రం ఒక పాత యుద్ధనౌకలో రకరకాల వ్యక్తులతో ప్రారంభమవుతుంది. ఇందులో చాలామంది నెరస్తులే ఉంటారు. ఈ నౌక ఒక వారం పాటు సముద్ర యాత్రకు బయలుదేరుతుంది. కానీ ఎక్కడికి వెళుతుందో, ఎందుకు ఈ వ్యక్తులు ఒకచోట చేరారో స్పష్టంగా తెలియదు. యాత్ర మొదట్లో ఈ ప్రయాణీకులు మద్యం, మాదకద్రవ్యాలు, అమ్మాయిలతో గడుపుతారు. ఇది త్వరలో హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. కొంత మంది గ్యాంగ్‌స్టర్‌లు మహిళలపై ఘోరంగా లైం*గిక దాడులు చేస్తారు. ఇది నౌకలో మనిషి సైకిక్ స్వభావాన్ని హైలైట్ గా చూపిస్తుంది. అయితే ఈ నౌకలో ఒక నెలకు అరిపోయే ఆహారం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో స్టోరీ వహించని మలుపులు తిరుగుతుంది.
ఈ ప్రయాణంలో ఒక రాత్రి ఈ నౌక పొగమంచు ప్రాంతంలోకి చిక్కుకుంటుంది. ఉదయానికి సముద్రం మాయమై, నౌక గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది ప్రయాణీకులలో భయం, గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఒక నెల ఆహార సరఫరాతో, నౌకలోని వ్యక్తులు మనుగడ కోసం పోరాటంలోకి దిగుతారు. ఇది త్వరలో తిరుగుబాట్లు, నరమాంస భక్షణకు దారితీస్తుంది. ఈ సీన్స్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళంతా ఎవరు ? ఎందుకు ఓడలో ప్రయాణం మొదలెట్టారు ? వీళ్ళంతా ప్రాణాలతో బయటపడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ సినిమాను చూడాల్సిందే.
ఎందులో ఉందంటే
‘Human, Space, Time and Human’ కొరియన్ దర్శకుడు కిమ్ కీ-డుక్ దర్శకత్వంలో రూపొందిన ఒక సైన్స్-ఫిక్షన్ చిత్రం. ఇది 2018 ఫిబ్రవరి 17న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఇందులో మినా ఫుజీ, జాంగ్ కీన్-సుక్, అహన్ సంగ్-కీ, లీ సంగ్-జే, ర్యూ సీంగ్-బం, జో ఒడాగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. 122 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.8/10 రేటింగ్ ను పొందింది. JustWatchలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : అయ్య బాబోయ్… అమ్మాయిలు ఆ విద్య నేర్చుకోవాలంటే ఇతనితో ఏకాంతంగా… ఈ హర్రర్ మూవీలో ఆ సీన్లే హైలెట్