BigTV English

Horoscope Today August 13th: రాశి ఫలితాలు: ఆ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభం 

Horoscope Today August 13th: రాశి ఫలితాలు: ఆ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభం 

Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 13వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేషరాశి: ఊహించని ఖర్చులు, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ సంబంధమైన పనులు పూర్తవుతాయి. ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రముఖులతో కలిసి సమయం గడుపుతారు. కాంట్రాక్టు పనుల్లో శ్రధ్ధ వహించాలి.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1


కలిసి వచ్చేరంగు: గంధంరంగు

విష్ణుమూర్తి ఆలయంలో తులసిమాల సమర్పించండి

 

వృషభరాశి: అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్తవారితో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార లావాదేవీలు జరుపుతారు. పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు. మానసికమైన ఆందోళన వేధిస్తుంది. నమ్మిన వ్యక్తుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో సోదరులతో విబేధాలు ఏర్పడుతాయి.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6

కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ రంగు

గణపతిని గరికతో పూజించండి సింధూరం సమర్పించండి.

 

మిథునరాశి: భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. షేర్లలో పెట్టుబడుల వల్ల నష్టాలు చవి చూస్తారు. యంత్రాలతో, వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. కుటుంబంలో కలహాలు మానసికంగా కుంగదీస్తాయి.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7

కలిసివచ్చే రంగు: కాషాయం రంగు

దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి.

 

కర్కాటకరాశి: క్రీడలకు సంబంధించిన విషయాల్లో పాల్గొంటారు. అనుమానంతో ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తారు. చేతికి వచ్చిన సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతారు. సోదరులను మోసం చేస్తారు. ధర్మ సంబంధమైన పని ఒకటి పూర్తి చేస్తారు.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3

కలిసివచ్చే రంగు: లేతపసుపు రంగు

దుర్గాదేవి ఆలయంలో మినప వడలు సమర్పించండి.

 

సింహరాశి: చపల చిత్తంగా ప్రవర్తిస్తారు. ఆందోళన వెంటాడుతుంది. తలనొప్పితో బాధ పడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసం శతవిధాలా ప్రయత్నిస్తారు. ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారు.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8

కలిసి వచ్చేరంగు: లేత నీలంరంగు 

తెల్లజిల్లేడు పూవులతో గణపతిని పూజించండి.  

 

కన్యారాశి: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అంతర్గత శతృవులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సహధర్మచారిణితో కలిసి దాన, ధర్మాలు చేస్తారు. ఆనుకోని వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2

కలిసివచ్చేరంగు: తెలుపు రంగు

లక్ష్మీదేవి ఆరాధన శుభఫలితాలను అందిస్తుంది.

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి: ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థికంగా సంతృప్తిగా ఉంటారు. తీవ్రమైన ఆలోచనల వల్ల నిద్రలేమితో బాధపడుతారు. సంతానానికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పెద్దలను గౌరవించాలి.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5

కలిసి వచ్చేరంగు: నలుపురంగు

నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

 

వృశ్చికరాశి: గంగా స్నాన ప్రాప్తి కలుగుతుంది. మతి మరుపు వల్ల నష్టపోతారు. మిత్రుల సహాకారం అందుతుంది. కొండపై ఉన్న దేవాలయాలను దర్శిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4

కలిసి వచ్చేరంగు: బూడిదరంగు

గ్రామదేవతను దర్శించి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించండి.

 

ధనస్సురాశి: హోటల్ రెస్టారెంట్స్ వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. టెండర్లు దక్కుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కొందరు మీపై దాడికి ప్రయత్నిస్తారు.

ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5

కలిసి వచ్చేరంగు: మెరూన్ కలర్

కాలభైరవాష్టకం చదవడం వినడం విజయాన్ని చేకూరుస్తుంది.

 

మకరరాశి: భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. చెవి, గొంతు, కళ్ళకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతారు. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 9

కలిసి వచ్చేరంగు: ఎరుపురంగు

దత్తాత్రేయ స్వామిని దర్శించడం వల్ల శుభం కలుగుతుంది.

 

కుంభరాశి: వివాహ వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి పరమైన మార్పులు జరుగుతాయి. స్థానచలనం కలుగుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతాయి. తోటలు ఎస్టేట్స్ కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తారు. వాహన యోగం ఉంది.

ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3

కలిసి వచ్చేరంగు: పసుపు పచ్చరంగు

సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

 

మీనరాశి: ఇంటి విషయాలు ఇతరులతో చర్చించకండి. జీవిత భాగస్వామిని గౌరవించండి. వారికి తగిన సహాయం చేయండి. సంతానం విషయంలో శుభవార్త అందుతుంది. నగలు కొనుగోలు చేస్తారు. వృథా ప్రయాణాలు చేస్తారు. గుప్త శతృవులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8

కలిసి వచ్చేరంగు: లేతగులాబీ రంగు

శివాలయంలో ఆవునెయ్యితో దీపం వెలిగించండి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Baba Vanga Prediction: బాబా వంగ జోస్యం.. 4 నాలుగు రాశులవారు కోటీశ్వరులు అయిపోతారట!

Sneezing: తుమ్మడం ఎప్పుడైనా అపశకునంగా బావిస్తారు – కానీ ఆ 7 సందర్భాల్లో మాత్రం శుభసూచకమట

Evil Eye Symptoms: ఈ 6 లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా నరదృష్టి లక్షణాలే..

Horoscope Today August 12th: రాశి ఫలితాలు:  ఆ రాశి జాతకులకు ఇవాళ పట్టిందల్లా బంగారంలా ఉంటుంది

Vish Yog 2025: 30 ఏళ్ల తర్వాత విషయోగం.. ఆగస్ట్ 12 నుంచి వీరికి అడుగడుగునా కష్టాలు

Big Stories

×