E-Paper
Advertisement

ఈ చిన్న రెమెడీస్ పాటిస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట

ఈ చిన్న రెమెడీస్ పాటిస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట
Advertisement

Simple remedies: మీరు వ్యాపారంలో తరుచుగా నష్టాలను చూస్తున్నారా..? ఏంత ప్రయత్నించినా మీ వ్యాపారంలో అభివృద్ది కనిపించడం లేదా..? అయితే ఈ చిన్న రెమెడీస్‌ పాటించండి.. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట. మీకు వ్యాపారంలో తిరుగే ఉండదట. ఇంకా మీ వ్యాపారం అభివృద్ది పథంలో దూసుకెళ్తుందట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాపారంలో ఆటంకాలు తొలగి, అభివృద్ధి చెందడానికి కొన్ని సరళమైన ప్రభావవంతమైన పరిహారాలు (Remedies) చాలానే ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఎవరికి వారే సులభంగా చేసుకునే ఈ రెమెడీస్ పాటించడం వల్ల మీ వ్యాపారంలో లాభాలు విపరీతంగా పెరుగుతాయట ఆ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నిమ్మకాయ, పచ్చిమిర్చి పరిహారం: ఈ తంత్రం చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే సులభమైనది కూడా ఈ పరిహారం కోసం ఏడు పచ్చి మిరపకాయలు, ఒక నిమ్మకాయ తీసుకుని రెండిటిని కలిపి  ఒక దారానికి గుచ్చి మీ వ్యాపార సంస్థ లేదా దుకాణం ప్రధాన ద్వారం వద్ద కట్టాలట. ఇలా చేయడం మీ వ్యాపారానికి కానీ షాపుకు కానీ ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ పోతుందట. దిష్టి (Evil Eye) ప్రభావాన్ని తగ్గిస్తుందట. ఈ పరిహారం ప్రతి శనివారం లేదా మంగళవారం చేస్తుండాలట.

ఉప్పుతో శుద్ధి (Salt Remedy): నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం షాపును శుభ్రం చేసేటప్పుడు, నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు (Sea Salt) కలిపి ఆ నీటితో నేలను తుడవాలట. ఇలా చేయడం వల్ల వ్యాపార స్థలంలో ఉన్న ప్రతికూల ప్రకంపనలు తొలగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుందట.

Advertisement

కర్పూరం, లవంగాల ధూపం: వ్యాపారంలో ధన ప్రవాహం పెరగడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుందట. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన సమయంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో రెండు కర్పూరం బిళ్ళలు మరియు రెండు లవంగాలు వేసి వెలిగించి, ఆ ధూపాన్ని షాపు అంతా చూపించాలట. ఇది లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుందట అలాగే శత్రు బాధలను తగ్గిస్తుందట.

పచ్చ పెసరపప్పు పరిహారం (బుధ గ్రహం కోసం): వ్యాపారానికి కారకుడైన బుధ గ్రహం అనుగ్రహం కోసం ఈ పరిహారం చాలా బాగా పని చేస్తుందట. బుధవారం నాడు ఒక గుప్పెడు పచ్చ పెసరపప్పును తీసుకుని, మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుని (దిష్టి తీసినట్లు), పక్షులకు ఆహారంగా వేయాలట. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో వచ్చే నిర్ణయాత్మక లోపాలు తొలగి, బుద్ధి చాతుర్యం పెరుగుతుందట.

గోమతి చక్రాల స్థాపన: తంత్ర శాస్త్రంలో గోమతి చక్రాలకు ప్రత్యేక స్థానం ఉందట. 11 గోమతి చక్రాలను తీసుకుని  ఎర్రటి వస్త్రంలో కట్టి మీ షాపులోని కౌంటర్ (డబ్బులు దాచుకునే పెట్టె) లో ఉంచాలట. వీటికి ప్రతిరోజూ అగరుబత్తీలతో ధూపం చూపించడం వల్ల ఇది నిరంతర ధన ప్రాప్తిని, వ్యాపార వృద్ధిని కలిగిస్తుందట.

అయితే ఈ పరిహారాలు చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, శుచిగా ఉండి చేయాలని పండితులు సూచిస్తున్నారు.  

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: 9వ తేదీన పుట్టరా..? మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×