DMart Offers: ఎల్‌పీజీ లభ్యతపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో మార్కెట్ లో రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్స్ కు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అయితే సహజంగానే తక్కువ ధరకు వస్తువులను విక్రయించే డీమార్ట్.. ఈ ప్రొడక్ట్స్ పై మరింత రాయితీ అందిస్తోంది. ప్రముఖ కంపెనీల రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్స్ ధరపై 7 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం డీమార్ట్ లో ఆఫర్ లో లభిస్తున్న రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Pigeon Induction Cooktop Acer Plus (1800 W): ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు వేగంగా ఆహారాన్ని కుకింగ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏడాది వారంటీతో ఇది లభిస్తుంది.
Prestige Induction Cooktop PIC 20.0 (1600 W): సులభమైన కంట్రోల్స్, టైమర్ ఫీచర్, ఇండియన్ మెనూ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి.
Prestige Spark Induction Cooktop (1200 W): తక్కువ బడ్జెట్ లో నాణ్యమైన ఇండక్షన్ కుక్కర్ కోరుకునేవారికి ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
Wonderchef Swift Induction Cooktop (2200 W): దీని ద్వారా ఆహారాన్ని త్వరగా కుక్ చేసుకోవచ్చు. మెరుగైన పనితీరును సైతం ఇది కనబరుస్తుంది.
Butterfly Blossom Electric Rice Cooker (1.8 L, 700 W): ఇది బేసిక్ మోడల్ రైస్ కుక్కర్. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీని కలిగి ఉంది. 5 ఏళ్ల వారంటీతో ఇది లభిస్తుంది.
Prestige Cute Electric Rice Cooker (700 W): దీనికి రెండు స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యాన్లు వస్తాయి. ఇది రైస్ ను చాలా వేగంగా కుక్ చేసేస్తుంది.
Agaro Regency Electric Rice Cooker (700 W, 5L): ఇది అధిక సామర్థ్యం కలిగిన రైస్ కుక్కర్. ఒకేసారి 1.5 కేజీ బియ్యాన్ని ఉడికించుకోవచ్చు. కీప్ వార్మ్ ఫంక్షన్, సిరామిక్ బౌల్, ఎల్ఈడీ లైట్లు వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను సేల్ చేయవచ్చు. ఆన్ లైన్ కోసం.. www.dmart.in వెబ్ సైట్ లేదా యాప్ ను ఉపయోగించవచ్చు. అందులో మీ నగరాన్ని ఎంచుకొని సెర్చ్ బాక్స్ లో ‘Induction cooktop’ లేదా ‘Electric rice cooker’ అని సెర్చ్ చేసి నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు. లేదంటే మీకు దగ్గరలోని డీమార్ట్ స్టోర్ కు వెళ్లి కూడా నచ్చిన ప్రొడక్ట్ ను సొంతం చేసుకోవచ్చు.
Also Read: LPG Alternatives: గ్యాస్ సమస్య వేధిస్తుందా? ఈ స్మార్ట్ పరికరాలతో.. నచ్చింది తినేయచ్చు!