E-Paper
Advertisement

Good days: మీకు మంచి రోజులు వచ్చే ముందు ప్రకృతి మీకు కొన్ని సంకేతాలు పంపిస్తుందట

Good days: మీకు మంచి రోజులు వచ్చే ముందు ప్రకృతి మీకు కొన్ని సంకేతాలు పంపిస్తుందట
Advertisement

Good days: మీకు మంచి రోజులు రాబోయే ముందు మీకు ప్రకృతి కొన్ని సంకేతాలు పంపిస్తుందట. ఆ సంకేతాలను అర్థం చేసుకుటే మీకు మంచి రోజులు వస్తాయని తెలుసుకోవచ్చట. అయితే ప్రకృతి పంపే ఆ సంకేతాలేంటి..? అవి ఎలా వస్తాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మీ జీవితంలో మంచి రోజులు రావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని భారతీయ తంత్రశాస్త్రజ్ఞులు, జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ప్రకృతే స్వయంగా మీకు ఆ సంకేతాలు పంపిస్తుందట. ఆ సంకేతాలు వస్తున్నాయంటే మీకు శుభకాలం మొదలవబోతుందని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

అనుకోకుండా మంచి అవకాశాలు రావడం: మీకు మంచి టైం రాబోతుందంటే అప్పుడే మీకు అనుకోకుండా కొత్త అవకాశాల వస్తాయట. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయట. అలాగే డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కువగా అకస్మాతుగా వస్తాయట.

మనసులో సానుకూల ఆలోచనలు పెరగడం: మంచి టైం వచ్చే ముందు మీ మనసులో సానుకూల ఆలోచనలు పెరుగుతాయట. ఎందుకో తెలియకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుందట. అలాగే అంతవరకు మనసులో ఉన్న భయం తగ్గిపోతుందట.

Advertisement

దేవుడి మీద ఆకర్షణ పెరగడం: మీకు అనుకోకుండా దేవుడి మీద భక్తి పెరగడం కూడా మీకు మంచి టైం రాబోతుందనడానికి సంకేతమట. అలాగే గుడికి  వెళ్లాలని అనిపించడం, పూజలు చేయాలనే ఆసక్తి పెరగడం కూడా పాజిటివ్‌ ధోరణికి కారణాలట.

పాత సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోవడం: మీకు మంచి టైం రాబోతుందంటే ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల కూడా తగ్గుముఖం పడతాయట. చాలా కాలంగా ఉన్న  కష్టాలు మెల్లగా తీరిపోతుంటాయట.

కలలో శుభ సూచనలు కనిపించడం: మీకు మంచి టైం వచ్చే ముందు మీకు స్వప్నంలో కూడా సంకేతాలు వస్తాయట. కలలో దేవాలయం కనిపించడం… గుడిలో గంటలు మోగిన శబ్దం వినిపించడం. కలలో పాలు లేదా నీళ్లు కనిపించడం,  అలాగే పూలతోట లేదా పూలు కనిపించడం.. వెలుగు లేదా దీపం కనిపించడం కూడా సంకేతంగా భావించాలట.

ఇంకా ఇంట్లో శుభవాతావరణం పెరగడం. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోయి ప్రేమ వాతావరణం ఏర్పడటం.. చిన్న చిన్న అదృష్టాలు కలగడం, కొద్దికొద్దిగా  డబ్బు దొరకడం, మంచి వార్తలు వినడం.. మీరు చేస్తున్న పనుల్లో విజయాలు చేకూరడం. అలాగే కొత్త వ్యక్తులు సహాయం చేయడం కూడా శుభ సమయం వచ్చే ముందు వచ్చే సంకేతాలుగా భావించాలట. అలాగే బాడ్‌ టైం ఉన్నని రోజులు ఆ వ్యక్తులు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే గుడ్‌ టైం మొదలవ్వడానికి ముందు శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. చేస్తున్న పని మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరు చేసే చిన్న ప్రయత్నాలైనా పెద్ద ఫలితాలు ఇస్తుంటాయట. అంతకు ముందు చాలా కష్టంగా అనిపించిన పనులు కూడా సులభంగా పూర్తవుతుంటాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: 1914కు 2026కు ఉన్న లింకేంటి..? అప్పటి వినాశనమే ఇప్పుడు పునరావృత్తం అవుతుందా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×