E-Paper
Advertisement

Anksha Reddy: ఉపాధి హామీ చట్టం మార్పును అడ్డుకుంటాం.. డిసిసి అధ్యక్షురాలు, ఆంక్షరెడ్డి

Anksha Reddy: ఉపాధి హామీ చట్టం మార్పును అడ్డుకుంటాం.. డిసిసి అధ్యక్షురాలు, ఆంక్షరెడ్డి
Advertisement

Anksha Reddy:  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, ప్రజల హక్కులను తిరిగి కల్పించడంతోపాటు పంచాయతీల పాలనాధికారాన్ని పునరుద్ధరించాలని, వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రంలో అలాగే వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ లబ్ధిదారులతో ముచ్చటించి, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తూ, గ్రామపంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారులను నిర్వీర్యం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో మేము సైతం అంటూ గ్రామ గ్రామాన ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

Also Read: Falaknuma Fire: ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి

ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు 

Advertisement

మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం మార్పును ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించి పేద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలను తీసుకురావద్దని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలని వి బి జి రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, డిమాండ్ చేశారు. ఉపాధి హక్కు పథకం వలన గతంలో ప్రజలు సంవత్సరానికి వంద రోజులు పని హక్కు ఉండేదని, కానీ ఇప్పుడు వి బి జి రామ్ చట్టం వలన కూలీల పని అవకాశాలు తగ్గి, తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్, యూత్ కాంగ్రెస్ నాయకులు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Pawan Kalyan: రాజకీయాలలోకి రావచ్చు కదా..ఆ హీరోయిన్ కు పవన్ ఆఫర్.. ఎవరా బ్యూటీ?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×