Third World War: 1914కు 2026కు ఉన్న లింకేంటి..? అప్పటి వినాశనమే ఇప్పుడు మళ్లీ పునరావృత్తం కానుందా..? సరిగ్గా 112 ఏండ్ల క్రితం ఏం జరిగింది. ఇప్పడు అంటే దాదాపు శతాబ్దం తర్వాత ఏం జరుగుతుంది. ఏం జరగబోతుంది. చరిత్ర పునరావృత్తం అవుతుందా… లేదంటే ప్రపంచం పురోగమనం వైపు వెళ్తుందా..? అప్పటి క్యాలెండర్ నుంచి ఈ సంవత్సరం క్యాలెండర్‌లో పోలిక ఉన్న అంశాలేంటి..? విశ్లేషకులు ఏమంటున్నారు.. అసలు మూడో ప్రపంచ యుద్దం మొదలైందా..? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాలచక్రం వెనక్కి వెళ్లినట్టు ఉందంటున్నారు విశ్లేషకులు.. 2026 క్యాలెండర్‌ను పరిశీలంచి 1914 క్యాలెండర్‌ను మళ్లీ తిరగేస్తే.. అది నిజమేననట్టు సంకేతాలు వస్తున్నాయంటున్నారు. 112 ఏళ్ల క్రితం జరిగిన ప్రపంచ వినాశనమే మళ్లీ జరగబోతుందేమోనని అనుమానిస్తున్నారు.
1914 అనగానే మనకు గుర్తొచ్చేది మొదటి ప్రపంచ యుద్ధం. ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన యుద్దం యావత్తు ప్రపంచాన్ని వందేళ్లు వెనక్కి నెట్టింది. అప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న బ్రిటీష్ ఎంపైర్ మసకబారింది. అమెరికా ప్రపంచ శక్తిగా ఎదిగింది. మొదటి ప్రపంచ యుద్దంలో లక్షల మరణాలు.. కోట్ల ఆస్తులు ధ్వంసం చెప్పుకుంటే పోతే అదో రక్తచరిత్ర అవుతుంది. అయితే 2026లో కూడా మొదటి ప్రపంచ యుద్దం తాలూకూ లక్షణాలు కనిపిస్తున్నయని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇప్పుడు మనం చూస్తున్న 2026 క్యాలెండర్, ప్రపంచ చరిత్రను వణికించిన 1914 క్యాలెండర్‌తో అంగుళం కూడా తేడా లేకుండా పోలికలు ఉన్నాయట. 1914వ సంవత్సరం గురువారంతో మొదలైతే 2026 కూడా సరిగ్గా గురువారంతోనే ప్రారభం అయింది. ఇక 1914లో లీపు సంవత్సరం లేదు. 2026 కూడా లీపు సంవత్సరం కాదు. అలాగే 1914 జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు ఎలా ఉందో.. 2026 కూడా సేమ్ మొత్తం అలాగే ఉందట. తేదీలు, వారాలు మొత్తం సరిపోలి ఉన్నాయట. అలాగే ఈ సంవత్సరం ఇజ్రాయెట్, ఇరాన్ యుద్దం కూడా చిలికి చిలికి గాలివానలా మారుతుందని అది ప్రపంచ యుద్దానికి దారి తీసేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా క్యాలెండర్లు ప్రతి 28 ఏళ్లకు ఒకసారి రిపీట్ అవుతుంటాయి. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ వ్యవస్థలోని చిక్కుల వల్ల కొన్నిసార్లు దశాబ్దాల తర్వాత ఇలాంటి వింతైన కలయికలు సంభవిస్తాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది కేవలం గణిత శాస్త్ర లెక్కల అమరిక మాత్రమే, భవిష్యత్తును సూచించేది కాదు. కానీ, ఒకే క్యాలెండర్ కింద రెండు వేర్వేరు యుగాలను అలాగే ప్రపంచం యుద్ధం లో మునిగిపోవడాన్ని చూడటం నిజంగా ఒక టైమ్ ట్రావెల్ లాంటి అనుభూతే అంటున్నారు. ఆ అద్భుతం వెనుక ఉన్న రహస్యం కేవలం యాదృచ్చికం కాదు, మాథ్స్ మన మీదకి విసిరిన ఒక అద్భుతమైన పజిల్ అంటున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.